Telangana: వరంగల్‌లో వీరంగం సృష్టించిన సైకో..ఇంట్లో చొరబడి రాళ్లతో దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఈ మధ్య సైకోలు ఎక్కువ అవుతున్నారు.. అసలు ఎక్కడినించి వస్తున్నారో కూడా తెలియకుండా కనిపించిన వారిపై దాడికి తెగబడుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా తెలంగాణలో మరో సైకో వీరంగం సృష్టించాడు.. కనిపించిన వారిని ఇష్టానూసారంగ కొట్టి గాయపరిచాడు.. ఈ ఘటన వరంగల్ లో వెలుగుచూసింది..
ఈ విచిత్ర సైకో సంఘటన పుప్పాలగుట్ట ప్రాంతంలో జరిగింది. అతను ఎవరో అక్కడివారికి తెలియదు. కానీ అతడు నేరుగా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు.. ఇంట్లో ఉన్నవారిపై రాయితో దాడి చేశాడు. దీంతో వారి అరుపులు విన్న స్థానికులు హడలెత్తిపోయారు. ధైర్యం చేసి అతన్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు సంచులు చేత పట్టుకొని ఇంట్లోకి ప్రవేశించాడు. ఎవరు మీరని ప్రశ్నించడంతో అతడు ఆగ్రహం తో ఇంటి యాజమానిపై రాయితో దాడి చేశాడు. ఇంట్లో వారి అరుపులు విని ఇరుగు పొరుగు వారంతా అక్కడి చేరుకున్నారు. ఎవరు నువ్వని నిలదీయడం తో ఆసీఫ్ అనే మరోవ్యక్తిపై ఆ సైకో దాడికి పాల్పడ్డాడు.. అతను కూడా తీవ్రంగా గాయపడ్డారు..
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ఇక అందరు దైర్యం చేసి గ్రామస్తులు అతన్ని అతి కష్టం మీద పట్టుకున్నారు.. అతని మానసిక స్తితి సరిగా లేదనని స్థానికులు గుర్తించారు. చివరికి అతడ్ని పట్టుకుని ఓ స్తంభానికి కట్టేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాని కి వచ్చిన అతడ్ని తీసుకెళ్లారు. అయితే దాదాపు రెండు గంటల పాటు ఆ సైకో సృష్టించిన వీరంగంతో జనాలు భయంతో వణికిపోయారు.. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.. పోలీసులు ప్రస్తుతం అతన్ని మానసిక వైద్యుల దగ్గర కు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
ట్రెండింగ్
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..