ఆదివారం పండుగవేళ ఒక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. అందరు సంతోషంగా ఆ ఊరిలో ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. పండుగపూట మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంబాలపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది..
వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్ధరాత్రి కారు-ఆటో ఢీకొని నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఒకే కుటుంబంలోని తల్లి, కుమారుడు, మనవడు, మనవరాలుగా పోలీసులు గుర్తించారు.. వీరంతా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ వాసులు అని వెల్లడించారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలైనట్లు చెప్పారు. మహబూబాబాద్ ఆస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నట్లు వివరించారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..
వేగంగా కారును డ్రైవ్ చేస్తూ ఆటోను డీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.. పండుగ వేళ ఊరంతా సందడిగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా చనిపోవటంతో బంధువులతో పాటుగా ఊరంతా కూడా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..