Site icon NTV Telugu

Crypto Fraud : తెలంగాణలో వెలుగులోకి క్రిప్టో కరెన్సీ మోసం.. రైతుల పేర్లతో రూ.170 కోట్లు..

Crypto Fraud

Crypto Fraud

Crypto Fraud : తెలంగాణలో మరో పెద్ద క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది. కూలీలు, రైతులు, ఉద్యోగుల పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించి కోట్ల రూపాయల లావాదేవీలు చేసినట్లు బయటపడింది. ఇప్పటివరకు సుమారు రూ.170 కోట్ల విలువైన మోసపూరిత క్రిప్టో లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు. సిద్దిపేట, ఖమ్మం, హైదరాబాద్‌, జగిత్యాల, సత్తుపల్లి ప్రాంతాల్లో ఈ మోసాలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. పాన్‌కార్డులను వినియోగించి నకిలీ అకౌంట్లు తెరిచి లావాదేవీలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 20కి పైగా మోసాల వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్.. లడఖ్ అల్లర్లపై కేంద్రం ఉక్కుపాదం..

లాలాగూడలో వాటర్ ప్లాంట్ ఉద్యోగి పేరుతో రూ.34 కోట్ల లావాదేవీలు, సత్తుపల్లిలో రైతు పేరుతో రూ.31 కోట్ల లావాదేవీలు జరిపినట్లు విచారణలో తెలిసింది. ఖమ్మంలో ఫార్మా ఉద్యోగి పేరుతో రూ.19 కోట్లు, సిద్దిపేట రైతు పేరుతో రూ.9 కోట్లు, జగిత్యాల డెలివరీ బాయ్ పేరుతో రూ.20 కోట్ల లావాదేవీలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజల పేర్లను వాడుకొని ఇంత పెద్ద మొత్తంలో క్రిప్టో ట్రాన్సాక్షన్లు జరపడం వెనుక పెద్ద రాకెట్ ఉందని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

OG : ఫ్యాన్స్ కు ఏళ్ల కల తీర్చేసిన సుజీత్..

Exit mobile version