Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Telangana Andhra Pradesh Theft Gangs Bank Car Break Ins Hyderabad Lbnagar Case

Theft Gangs: సినీ స్టైల్ చోరీలు.. పోలీసులకు సవాల్ విసురుతున్న ముఠాలు..

Published Date :March 21, 2026 , 9:15 pm
By RAMAKRISHNA KENCHE
Theft Gangs: సినీ స్టైల్ చోరీలు.. పోలీసులకు సవాల్ విసురుతున్న ముఠాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Theft Gangs: తెలుగు రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ముఠాలుగా ఏర్పడి మరీ దోచుకు వెళ్తున్నారు. ఆదమరిస్తే చాలు ఆసాంతం సొత్తు చోరీ చేసి జంప్ అవుతున్నారు. ఇళ్లు తాళం వేసి ఉంటే చాలు.. ఇంట్లోని వారు వచ్చే వరకు ఉన్నదంతా ఊడ్చుకెళ్తున్నారు. అంతే కాదు.. ఈ మధ్య నైస్‌గా ఇంట్లోకి సర్వీస్ పేరుతో చొరబడి కూడా చోరీలు చేస్తున్నారు. ఇలాంటి చోరీలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో బ్యాంక్‌ల దగ్గర చోరీలకు పాల్పడే మహా ముఠా హల్చల్ చేస్తుంది. సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతోంది ఓ ముఠా. బ్యాంకు ముందే కారు అద్దాలను ధ్వంసం చేసి 3 లక్షల రూపాయలు లూటీ చేసిన ఉదంతం బోధన్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన హరిబాబు వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఈ భూమికి సంబంధించిన డబ్బులు చెల్లించేందుకు కెనరా బ్యాంకులో 3 లక్షల రూపాయలు డ్రా చేసేందుకు వచ్చారు. బ్యాంకులో డబ్బులు డ్రా చేసి కారు డ్యాష్ బోర్డులో పెట్టి మరో బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు ముందు కారు హరిబాబు నగదు డ్రా చేసినప్పటి నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఆయన్ను అనుసరించారు. కారు పార్కింగ్ చేసి.. మరో బ్యాంకు కు వెళ్లడం చూసిన దొంగలు.. కారు ముందు భాగంలోని ఎడమ వైపు ఉన్న అద్దాలు ధ్వంసం చేసి… నగదు ఎత్తుకెళ్లారు. ఆ ముఠా చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దుండగులు ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డట్లు సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. ఈ తరహా చోరీ కొద్ది రోజుల క్రితం బాన్సువాడ లో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ చోరీ చేసింది ఇదే ముఠాగా పోలీసులు నిర్ధారణ కు వచ్చారు. డబ్బులు డ్రా చేసి.. కారులో పెట్టి మరో బ్యాంకుకు వెళ్లి వచ్చే లోపు నగదు లూటీ చేశారని బాధితుడు ఆవేదన చెందుతున్నారు.

READ MORE: Guntur Murder Case: మద్యం మాన్పించాలని కొడితే ప్రాణమే పోయింది.. భార్య చేతిలో భర్త హత్య!

సరిగ్గా నెల క్రితం బాన్సువాడలో ఓ వ్యక్తి బ్యాంకులో 8 లక్షలు డ్రా చేసి కారులో పెట్టి షాప్‌కు వెళ్లి వచ్చే లోపు.. కారు అద్దాలు ధ్వంసం చేసి లూటీ చేశారు. ఇప్పుడు బోధన్ ఇదే తరహాలో చోరీ చేయడం వెనుక ఆ ముఠా పనిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మహారాష్ట్రకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాకు స్థానికంగా ఎవరు సహకరిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలోని కమ్మవారిపల్లిలో భారీ చోరీ జరిగింది. పుల్లలచేరువులోని కమ్మవారిపల్లిలో మెడికొండ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు.. ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి లోపలికి చొరబడి ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి అందులో ఉన్న బంగారం, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ చోరీలో దాదాపు 23 లక్షల రూపాయల విలువైన బంగారం మాయమైందని బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. టెక్నికల్ ఎవిడెన్స్, ఆధారంగా అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్నారు. ఇద్దరు దొంగలను నల్గొండ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన హోండా సిటీ కారు, 2 ఇనుప రాడ్లతోపాటు చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని,వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు..

READ MORE: Ravichandran Ashwin: “4 ఓవర్లు వేయకపోతే రూ.2 కోట్లు కట్ చేయండి”.. ఆస్ట్రేలియా ప్లేయర్‌పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్..

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో ఓ దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. ఆ తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. అమెజాన్‌లో ఉద్యోగం చేస్తూ ఓ యువకుడు దొంగగా మారి మహిళపై దాడి చేసి బంగారం దోచుకెళ్లే ప్రయత్నం చేశాడు. రాక్‌హిల్స్ కాలనీలోని శైలజా రెసిడెన్సీలో నివసిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రవీణారెడ్డి ఇంట్లో ఈ ఘటన జరిగింది. అబ్రార్ అహ్మద్ అనే యువకుడు ఏసీ మెకానిక్‌గా నటిస్తూ ఫ్లాట్‌లోకి ప్రవేశించాడు. ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత.. ఇనుప సుత్తితో ఆమె తలపై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి మెడలో ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకుని నిందితుడు పరారయ్యాడు. గాయాలపాలైన మహిళ 100కు కాల్ చేయగా..వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.. ఘటనపై స్పందించిన ఎల్బీనగర్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కదలికలను ట్రాక్ చేసి కేవలం 2 గంటల వ్యవధిలోనే అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి దొంగిలించిన బంగారు పుస్తెల తాడును స్వాధీనం చేసుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh cases
  • bank car theft India
  • car glass break theft
  • gold robbery cases India
  • house burglary AP

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions