Ravichandran Ashwin: “4 ఓవర్లు వేయకపోతే రూ.2 కోట్లు కట్ చేయండి”.. ఆస్ట్రేలియా ప్లేయర్‌పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwin: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్‌కు మరికొన్ని రోజుల్లో షురూ కానుంది. ఈ సీజన్‌కు ముందు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ విషయంలో ఒక పెద్ద చర్చ మొదలైంది. గ్రీన్ పాత్ర, ఫిట్‌నెస్‌పై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు చేశారు. ఒక మ్యాచ్‌లో గ్రీన్ పూర్తి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయకపోతే.. అతడి జీతం నుంచి రూ.2 కోట్లు కట్ చేయాలని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 మినీ-వేలంలో కామెరాన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అతను ఆ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. సుదీర్ఘ గాయం తర్వాత గ్రీన్ ఇటీవలే క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. ఈ సీజన్‌లో కేకేఆర్ తరఫున కీలక పాత్ర పోషిస్తాడని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వారి జీతాల నుంచి కోత విధించే హక్కు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఉండాలన్నారు.
READ MORE: Dhurandhar 2: దురంధర్ నటుల్ని భలే పట్టారే.. రీల్ vs రియల్ పిక్స్ మీకోసం!
Also Read
ప్రత్యేకంగా కామెరాన్ గ్రీన్‌ను ఉదాహరణగా పేర్కొంటూ, గ్రీన్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేస్తే.. జట్టు అతని కాంట్రాక్ట్ నుంచి రూ.2కోట్లు తగ్గించాలన్నారు. “మీరు ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. పూర్తి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలనే అంచనా ఫ్రాంచైజీలకు ఉంటుంది. బ్యాటింగ్ సైతం చేస్తారని అంచనా ఉంటుంది. బౌలింగ్‌పై ఏవైనా ఆంక్షలు ఉంటే ఫర్వాలేదు.. కానీ ఏం లేకుండా కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేస్తే మీ కాంట్రాక్ట్ నుంచి నగదు కోతలు విధించే అవకాశం ఫ్రాంచైజీలకు ఉండాలి” అని అశ్విన్ అన్నాడు. ఇక గ్రీన్‌కు ఇటీవల గాయం అయినందున, నాలుగు ఓవర్లు బౌలింగ్ వేయగలడా? అనే చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు.. ఐపీఎల్‌లో కామెరాన్ గ్రీన్‌ను ప్రతి మ్యాచ్‌లో పూర్తి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అనుమతిస్తుందా? అనే చర్చల మధ్య రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!