Site icon NTV Telugu

Gadwal Murder : ఐదుసార్లు తప్పించుకున్న తేజేశ్వర్… ఆరోసారి బలయ్యాడు.. సంచలన విషయాలు వెలుగులోకి

Gadwal Murder

Gadwal Murder

Gadwal Murder : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రేమ పేరుతో మోసపోయిన తేజేశ్వర్‌ను కిరాతకంగా హత్య చేసిన ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెడుతున్నారు. తేజేశ్వర్ స్థానికంగా ప్రైవేట్ సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితమే ఐశ్వర్య అనే యువతిని ప్రేమించి, పెద్దల వ్యతిరేకతను ఎదుర్కొంటూ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఐశ్వర్యకు ఓ వివాహితుడు అయిన బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో ప్రేమ సంబంధం ఉంది. తన భార్యకు పిల్లలు లేనని చెప్పి, ఐశ్వర్యను రెండో భార్యగా తీసుకునేందుకు ఆమెతో చీకటి బంధాన్ని కొనసాగించాడు.

MIlk : పాలు పగిలినై.. గట్లెట్ల పలుగుతై.. పోలీస్ స్టేషన్ కు బాధితుడు

ఇదే సమయంలో ఐశ్వర్య.. తేజేశ్వర్ నిశ్చితార్థం కూడా తాత్కాలికంగా రద్దవ్వగా, తర్వాత మాయ మాటలతో తేజేశ్వర్‌ను ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా బ్యాంకు మేనేజర్‌తో సంబంధాన్ని కొనసాగిస్తూ.. తేజేశ్వర్ అడ్డు తొలగించాలనే కుట్రకు దిగింది. ఈ క్రమంలో ఐశ్వర్య తేజేశ్వర్ బైక్‌కు సీక్రెట్‌గా జీపీఎస్ ట్రాకర్ అమర్చింది. అతని ప్రతి కదలికను తెలుసుకుంటూ, డేటాను బ్యాంకు మేనేజర్‌కు చేరవేసింది. రూ.75,000 సుపారీకి హత్యకు ప్లాన్ రూపొందించి, ఓ గ్యాంగును రంగంలోకి దింపింది.

ఈ కుట్ర మొత్తం ఐదుసార్లు విఫలమవగా, ఆరోసారి తేజేశ్వర్ హంతకుల చేతిలో చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. సర్వే పనిమీద అని చెప్పి తేజేశ్వర్‌ను ఓ కారు ద్వారా పిలిపించి, కారులోనే అతని గొంతు కోసి హత్య చేశారు. మృతదేహాన్ని తాళ్లతో కట్టిపెట్టి, ఓ కవర్‌లో నంద్యాల జిల్లా పాణ్యం మండలం సమీపంలోని గాలేరి నగర కాల్వలో వదిలేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసును దర్యాప్తు చేయగా అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. తేజేశ్వర్ హత్యకేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, హంతకుడు మనోజ్, క్యాబ్ డ్రైవర్, మధ్యవర్తితో పాటు మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

Chengalpattu Express Robbery: చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ.. కేబుల్‌ కత్తిరించి..!

Exit mobile version