NTV Telugu Site icon

MP Shocker: చెల్లిపై అత్యాచారం, తల్లి ముందే హత్య.. ఎంపీ ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు..

Crime

Crime

MP Shocker: మధ్యప్రదేశ్ రేవాలో జరిగిన అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. 13 ఏళ్ల బాలుడు, 9 ఏళ్ల చెల్లిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. పోర్న్‌ చూసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసి, పక్కనే పడుకున్న సోదరిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తన తండ్రికి చెబుతారని చెప్పడంతో హత్య చేశాడు. ఏప్రిల్ 24న జరిగిన ఈ ఘటనలో అనుమానితుల డీఎన్‌ఏలను పోలీసులు విశ్లేషించగా, చివరకు బాలిక ప్రైవేట్ పార్టులోని స్పెర్మ్ నిందితుడితో మ్యాచ్ అయింది. ఈ కేసులో నిందితుడు తన తప్పును ఒప్పుకున్నాడు.

Read Also: Rahul Gandhi : ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌లో ప్రమాదం.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

ఈ ఘటనలో దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే, ఈ కేసులో బాలుడిని రక్షించేందుకు తల్లితో పాటు అతడి ఇద్దరు అక్కలు అతడికి సహకరించారు. ‘‘ఏప్రిల్ 24న జావా పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, గొంతు కోసి చంపారు, ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి మృతదేహం ఆమె ఉన్న ఇంటి ప్రాంగణంలో కనుగొనబడింది. బాలిక నిద్రపోయిన సమయంలో ఈ ఘటన జరిగింది’’ అని ఎస్పీ వివేక్ సింగ్ చెప్పారు.

13 ఏళ్ల బాలుడిని అతడి తల్లి, 17, 18 ఏళ్లు ఉన్న ఇద్దరు అక్కలు రక్షించే ప్రయత్నం చేశారు. నేరాన్ని కప్పిపుచ్చేందుకు సాయం చేసినట్లు అంగీకరించారు. బాలిక హత్య తర్వాత తన తల్లికి విషయం చెప్పాడు. అప్పటికే మేల్కొన్న ఇద్దరు అక్కలు దర్యాప్తుని తప్పుదారి పట్టించేందుకు బెడ్‌పై మరకల్ని తొలగించారు. దర్యాప్తుని తప్పుదారి పట్టించేందుకు బాలికను విషపు పురుగు కరించిందని వారు పేర్కొన్నారు. ఆమె మృతదేహాన్ని ప్రైవేట్ వైద్యుడి వద్దకు కూడా తీసుకెళ్లారు. చివరకు ప్రభుత్వం వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, బాలికపై అత్యాచారం, హత్య జరిగిందని తెలిపాడు. ఈ కేసులో దాదాపు 50 మందిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Show comments