Maharashtra: ఎన్ని సంఘటను జరిగినా.. అమ్మాయిలు మోసపోతూనే ఉన్నారు. ప్రేమ పేరులో మోసగించడం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అయినా కూడా అమ్మాయిల కళ్లు తెరుచుకోవడం లేదు. మోసగాళ్లు చెప్పే మాటలను నమ్మి నష్టపోతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలోని లాతూర్ లో జరిగింది. మాయమాటలు చెప్పి 18 ఏళ్ల యువతిని నమ్మించాడు. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Read Also: Devendra Fadnavis: జాతీయవాద ముస్లింలు ఎవరూ ఔరంగజేబును తమ నాయకుడిగా గుర్తించరు..
వివరాల్లోకి వెళితే.. చదువుకునేందుకు లాతూర్ వచ్చిన 18 ఏళ్ల అమ్మాయి స్థానికంగా ఒక హాస్టల్ లో ఉంటోంది. అయితే అమ్మాయికి 19 ఏళ్ల యువకుడు పరిచయం అయ్యాడు. బాధితురాలిలో స్నేహం నటిస్తూ.. ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను లాడ్జిలోకి తీసుకెళ్లి అసభ్యకరమైన ఫోటోలను తీశారు. వీటిని చూపిస్తూ ఏప్రిల్ నుంచి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో సదురు మహిళ వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసినట్లు శివాజీ నగర్ పోలీసులు వెల్లడించారు. యువకుడి చిత్రహింసలతో విసిగిపోయిన యువతి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376 (రేప్), 354 (ఏదైనా మహిళపై దాడి చేయడం లేదా నేరపూరిత శక్తిని ఉపయోగించడం, ఆమె నమ్రతకు భంగం కలిగించడం) కింద కేసులు నమోదు చేశారు. సోమవారం నిందితుడిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
