Suspended Police Constable Ramesh Arrested In Chain Snatching Case: ఏదైనా సమస్య వస్తే.. ప్రజలు ముందుగా పోలీసులకు ఆశ్రయిస్తారు. తమని సమస్య నుంచి సురక్షితంగా బయటపడేసేది పోలీసులు మాత్రమేనని జనాలు నమ్ముతారు. అలాంటి రక్షకులే భక్షకులు అయితే..? కొందరు తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు ఆర్జించాలన్న ఉద్దేశంతో.. అడ్డదారులు తొక్కుతున్నారు. తమకున్న అధికారాన్ని అడ్డంగా వాడేసుకుంటున్నారు. ఇటీవల ఓ కానిస్టేబుల్ అయితే.. ఏకంగా చైన్ స్నాచింగ్‌కే పాల్పడ్డాడు. తానే పోలీస్ అధికారి కాబట్టి.. తెలియకుండా కొట్టేసినా, ఎవ్వరికీ దొరనన్న ఉద్దేశంతో చైన్ స్నాచింగ్ దందాలోకి దిగాడు. కానీ, అతడి ప్లాన్ బెడిసికొట్టడంతో అడ్డంగా దొరికిపోయాడు.
ఆ పోలీస్ కానిస్టేబుల్ పేరు రమేశ్. అతని వయసు 31. తొలుత ఇతను మద్యానికి బానిసై, విధులకు సరిగ్గా హాజరయ్యేవాడు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు. దీంతో.. రమేశ్‌ను సస్పెండ్ చేశారు. అప్పుడే చైన్ స్నాచింగ్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో ఎవ్వరికీ దొరక్కపోవడంతో.. తరచూ చైన్ స్నాచింగ్‌కి పాల్పడుతూ వచ్చాడు. కానీ.. రీసెంట్‌గా అతడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కొత్తగూడలో ఓ మహిళ మెడల్ చైన్ దొంగలించి.. పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే.. స్థానికులు పారిపోతున్న ఆ కానిస్టేబుల్‌ని పట్టుకొని, దేహశుద్ధి చేశారు. దొంగలించిన చైన్‌తో పాటు ఆ కానిస్టేబుల్‌ని పోలీసులకు అప్పగించారు. అతడు సస్పెండ్ అయిన కానిస్టేబుల్ రమేశ్ అని తెలిసి.. అధికారులు ఖంగుతిన్నారు. రమేశ్ వద్ద ననుంచి 3 లక్షల 90 వేలు విలువ చేసే 9 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించారు.