ప్రేమ.. ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు.. ఇక ఈ ప్రేమలో పడినవారికి ఇద్దరు ఒకేచోట ఉండాలని, ఎక్కువ సమయం గడపాలని ఉంటుంది. ఇక ఈ కాలం ప్రేమ జంటలు అయితే ఎప్పుడు సమయం చిక్కిద్దా ..? ఏకాంతంగా గడుపుదామా అనే ఆలోచనలోనే ఉంటారు. దానికోసం ఏమైనా చేస్తారు. తాజాగా ఒక యువకుడు తన ప్రేయసితో ఏకాంతంగా గడపడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. కానీ, చివరికి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక మణిపాల్ హాస్టల్‌లో ఒక యువకుడు చదువుకుంటున్నాడు. అదే కాలేజీలో చదివే అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు కలిసి ఏకాంతంగా గడపాలనుకున్నారు. హాస్టల్ లో ఉంటున్న యువకుడు తన ప్రేయసిని రూమ్ కి తీసుకెళ్లాలి అనుకున్నాడు. హాస్టల్ వార్డెన్ కి తెలియకుండా ఉండడం కోసం పక్కా ప్లాన్ వేశాడు. ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ లో ప్రేయసిని కుక్కి, హాస్టల్ కి తీసుకెళ్లాడు. అంతా అనుకున్నట్లు జరిగితే మరో ఐదు నిమిషాల్లో ఇద్దరు రూమ్ లో ఉండేవారు. అయితే మధ్యలో హాస్టల్ వార్డెన్ యువకుడిని ఆపేశాడు.
బ్యాగ్ లో ఏముందో చూపించాలని కోరాడు. దీంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులు అంకుల్.. ఇంకేం లేవు అని తటపటాయిస్తూ చెప్పడంతో వార్డెన్ కి అనుమానమొచ్చి బ్యాగ్ ఓపెన్ చేయాలని పట్టుబట్టడంతో బ్యాగ్ ఓపెన్ చేయగా ప్రేయసి బయటికొచ్చింది. దీంతో ఖంగుతిన్న వార్డెన్ వారిద్దరి మీద ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేశారు. ఆ ప్రేమ జంట చేసిన తింగరి పనికి కాలేజ్ యాజమాన్యం ఇద్దరినీ సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ఏరా బాబు ఎంత కక్కుర్తి ఎందుకు..? అని కొందరు అంటుండగా.. పాపం పిల్లాడు హాస్టల్ వార్డెన్ కి అడ్డంగా దొరికిపోయాడే అని జాలి పడుతున్నారు.
