SRM University Harassment Case: ఎస్ఆర్‌ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఫిర్యాదుతో..

Srm University

Srm University

SRM University Harassment Case: గుంటూరు జిల్లాలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. యూనివర్శిటీకి చెందిన సైకాలజీ విభాగంలో పని చేస్తున్న మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్, అదే సంస్థలో ఎకనామిక్స్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ ఉబైద్ ముస్తాఖ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పెదకాకాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లోని “వానిష్ మోడ్” ఫీచర్‌ను ఉపయోగించి అసభ్యకరమైన సందేశాలు, పోస్టులు పంపుతున్నాడని బాధితురాలు తెలిపారు. ఈ చర్యల వల్ల తనకు మానసికంగా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: Zohran Mamdani-King Charles: కోహినూర్‌ వజ్రం భారత్‌కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్‌‌కు మమ్దానీ విజ్ఞప్తి!

ఇదే విషయంపై యూనివర్శిటీ మేనేజ్‌మెంట్‌కు ముందుగానే ఫిర్యాదు చేసినప్పటికీ, తగిన చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపించారు. దీంతో చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన యూనివర్శిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారి కలకలం సృష్టిస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.