NTV Telugu Site icon

Maharashtra: ఇంట్లో నుంచి దుర్వాసన.. లోపలికి వెళ్లిన పోలీసులకు షాక్..

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ గ్రామంలోని ఇంటిలో వృద్ధ దంపతులు, వారి 35 ఏళ్ల కుమార్తె శవాలు పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరాలుగా మారిన స్థితిలో కనుగొనబడ్డాయి. ముగ్గురి అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. జిల్లాలోని వాడా తాహసీల్‌లోని నెహ్రోలి గ్రామంలో శుక్రవారం వీటిని గుర్తించారు.

Read Also: Mohanlal: లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..

లోపల నుంచి లాక్ చేయబడిన ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానిక నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వాడా పోలీస్ స్టేషన్ అధికారి దత్తా కింద్రే తెలిపారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లగా, డ్రాయింగ్ రూపంలో ఇద్దరు మహిళల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో వారు షాక్ అయ్యారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. బాత్రూంలో పురుషుడి అస్థిపంజరం కనిపించింది. ఈ అవశేషాలు 70 ఏళ్ల వృద్ధుడివి, అతని 65 ఏళ్ల భార్య మరియు 35 ఏళ్ల వారి కుమార్తెగా అనుమానిస్తున్నారు. వీటిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

ముగ్గురు ఎలా మరణించారనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద హత్య, సమాచారాన్ని దాచడం మరియు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. వృద్ధ దంపతులు వారి వికలాంగురాలైన కుమార్తెతో అక్కడ నివసిస్తున్నట్లు తేలింది. వీరి ఇద్దరు కుమారులు జిల్లాలోని వాసాయిలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. అస్థిపంజరాల అవశేషాలు బయటపడటంతో గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.