Siddipet Boy Commits Suicide In Extramarital Affair Issue: వివాహేతర సంబంధాలు కాపురాల్ని కూల్చడమే కాదు.. ప్రాణాలు కూడా పోతున్నాయి. భర్తల్ని భార్యలే కడతేర్చడమో, కోపంతో రగిలిపోయి భర్తలే తమ భార్యల్ని చంపడమో వంటి నేరాలు వెలుగు చూస్తున్నాయి. కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా తెరమీదకొచ్చాయి. ఇప్పుడు ఓ యువకుడు కూడా ఈ వివాహేతర సంబంధం వ్యవహారంలో సూసైడ్ చేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్‌కి ఊహించని షాక్.. ఆ ఇద్దరు ఔట్?
సిద్ధిపేట జిల్లా కునూరుపల్లి మండలం మంగోల్‌కు చెందిన ఓ యువకుడు.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ షాపులో పని చేస్తున్నాడు. అతనికి అక్కడే పనిచేస్తున్న ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెకు అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి మధ్య పరిచయం, కొంతకాలం తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీళ్లిద్దరు ఎవరికి తెలియకుండా.. తమ రాసలీలలు కొనసాగించారు. అయితే.. ఇంతలో ఆమెకు మరో వ్యక్తితో పరిచయం అయ్యింది. అప్పటినుంచి అతనికి చనువుగా ఉంటూ, ఆ యువకుడ్ని దూరం పెట్టింది. తనని దూరం పెట్టడంతో, ఆ యువకుడు మానసికంగా కుంగిపోయాడు.
Imran Nazir: ఓడిపోతామనే భయంతోనే రావట్లేదు.. నిప్పులు చెరిగిన ఫ్యాన్స్
ఎందుకిలా చేస్తోందని ఆరా తీయగా.. మరో వ్యక్తితో ఆమె చనువుగా ఉన్నట్లు గుర్తించాడు. దీన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. ఆ వ్యక్తికి దూరంగా ఉండాలని కోరాడు. కానీ, ఆమె నిరాకరించింది. ఇది జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు, తన స్వగ్రామంలోని పొలానికి వెళ్లి, పురుగుల మందు తాగాడు. తన కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పి, కుప్పకూలాగాడు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.