Site icon NTV Telugu

Murder : చెల్లెలి మీద ప్రేమ.. బావను మర్డర్ చేసిన బామ్మర్దులు

murder

murder

Murder : చెల్లెలి కాపురాన్ని సరిదిద్దాల్సిన అన్నలు.. ఏకంగా బావను హత్య చేశారు. కిడ్నాప్ చేసి మరీ చంపేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో సంచలనం సృష్టించింది. ఐదు రోజుల్లోనే బావను హత్య చేసిన ఇద్దరు బామ్మర్దులను పట్టుకున్నారు పోలీసులు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహ్మద్ సిరాజ్. కొద్ది రోజుల క్రితమే పెళ్లి అయింది.. అంతా బాగుంది అనుకున్న టైమ్‌లో సిరాజ్ నిత్యం వేధిస్తున్నాడని అతని భార్య.. సోదరులకు సమాచారం ఇచ్చింది. బావతోపాటు అత్తమామలు వేధిస్తున్నారని తెలిపింది. దీంతో ఆ అన్నలు ఇద్దరికీ కోపం వచ్చింది. వెంటనే చెల్లెలు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో బావ సిరాజ్ ఇంట్లోనే ఉన్నాడు. దీంతో అతన్ని మాట్లాడుదామని చెప్పి ఇంట్లో నుంచి బయటకు తీసుకు వెళ్లారు.. అలా ఇద్దరు బామ్మర్దులతో కలిసి బైక్ పై వెళ్లిన సిరాజ్.. తిరిగి రాలేదు. అంతే కాదు మలక్‌పేట్ రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించాడు. అది చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read Also : War-2 : వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..?

ఇక రాత్రి సమయంలో.. బావను రైల్వే ట్రాక్ దగ్గరకు తీసుకు వెళ్లిన బామ్మర్దులు అతనితో గొడవ పడ్డారు. ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. గొడవ పెద్దది కావడంతో క్షణికావేశంలో ఇద్దరు బామ్మర్దులు కలిసి బావను అటుగా వస్తున్న ట్రైన్ కింద పడేశారు. ఫలితంగా సిరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బావ మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు బామ్మర్దులు. సిరాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. మొత్తానికి మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఇద్దరు బామ్మర్దులు కలిసి సిరాజ్ ను బైక్ పై తీసుకు వెళ్తున్న సీసీ ఫుటేజీ సంపాదించారు. ఆ తర్వాత వారిద్దరూ మాత్రమే వస్తున్న సీసీ ఫుటేజీని కూడా సేకరించారు. వాటి ఆధారంగా కేసును ఛేదించారు పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

Read Also : Mega 157 : మెగా-అనిల్ మూవీ నుంచి సాలీడ్ అప్డేట్.. ఎప్పుడంటే..?

Exit mobile version