Sheezan Khan Gives Sensational Statement in Tunisha Sharma Death Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీవీ నటి తునిషా శర్మ ఆత్మహత్య కేసులో మాజీ ప్రియుడు షీజాన్ ఖాన్ కీలక వాంగ్మూలం ఇచ్చాడు. పోలీస్ కస్టడీలో ఉన్న అతడు.. తమ బ్రేకప్‌కి కారణం శ్రద్ధా వాకర్ హత్య కేసేనని సోమవారం పోలీసులకు చెప్పాడు. శ్రద్ధా వాకర్ హత్యోదంతం తర్వాత దేశంలో వాతావరణం పూర్తిగా మారిపోయిందని.. ఆ కేసు తనపై తీవ్ర ఒత్తిడి పెంచిందని తెలిపారు. ఇద్దరికీ వయసు అంతరం (ఎనిమిదేళ్ల గ్యాప్)తో పాటు వేర్వేరు కమ్యూనిటీలు కావడం వల్ల.. అవి తమ పెళ్లికి ఆటంకం కలిగిస్తాయని తాను భావించానన్నాడు. మతాలు వేరు కావడం వల్లే తాను తునిషాకు బలవంతంగా బ్రేకప్ చెప్పానని అన్నాడు. లేపిపోని ఇరకాటంలో పడతామనే ఉద్దేశంతో తాను తునిషాతో రిలేషన్‌షిప్ వద్దనుకున్నానని పేర్కొన్నాడు.
Kerala Cunning Man : స్వీట్లు పంచాడు.. 100మందికి దావత్ అన్నాడు.. బిల్లు కట్టకుండా ఉడాయించాడు
అంతేకాదు.. తాను ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు కూడా ఓసారి తునిషా ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని షీజాన్ తెలిపాడు. అప్పుడు తానే ఆమెను రక్షించానని, ఇంటికి తీసుకెళ్లి తల్లికి తునిషాను అప్పగించానన్నాడు. తునిషాను జాగ్రత్తగా చూసుకోవాలని తాను ఆమె తల్లికి కూడా సూచించానన్నాడు. అయితే.. వీరికి దగ్గరగా ఉండే స్నేహితుల్ని విచారించిన తర్వాతే షీజాన్ చెప్తోంది వాస్తవమా? అబద్ధామా? అని వెరిఫై చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో షీజాన్ ‘మతం’ అనే కోణాన్ని తీసుకొచ్చాడు కాబట్టి, ఈ కేసు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందన్నారు. ఎస్ఎంఎస్, వాట్సాప్ చాట్, కాల్ రికార్డింగ్స్ ఆధారంగా.. షీజాన్ నిజంగానే శ్రద్ధా వాకర్ హత్యోదంతంతో భయపడి తునిషాకి బ్రేకప్ చెప్పాడా? లేకపోతే పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆ కేసుని తెరమీదకి తెచ్చాడా? అనేది తేలుస్తామన్నారు. మరో ట్విస్ట్ ఏమిటంటే.. షీజాన్ సీక్రెట్ ప్రియురాలి కోణం కూడా తెరమీదకి వచ్చింది. మరి.. ఆమెకు, తునిషాకి మధ్య ఏవైనా సంభాషణలు జరిగాయా? లేదా? అన్నది మిస్టరీగా మారింది.
Ravichandran Ashwin: 34 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టి.. చరిత్ర సృష్టించిన అశ్విన్
కాగా.. డిసెంబర్ 24వ తేదీన టీవీ షూటింగ్ జరుగుతున్న చోటే టాయ్‌లెట్‌లో తునిషా శర్మ(20) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో.. బహుశా ఆమె ఆత్మహత్యకు బ్రేకప్ కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే.. తునిషా, షీజాన్ గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే.. తునిషా సూసైడ్ చేసుకోవడానికి పదిహేను రోజుల కిందటే ఆమెకు బ్రేకప్ చెప్పాడు. తునిషా ఆత్మహత్య చేసుకున్న రోజు షీజాన్, తునిషా ఫస్ట్ షిఫ్ట్ షూట్‌లో కలిసే పాల్గొన్నారు. దీంతో.. ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద షీజాన్‌ను అరెస్ట్ చేశారు. మరోవైపు.. షీజాన్‌పై తునిషా తల్లి వనిత తీవ్ర ఆరోపణలు గుప్పించింది. తన కూతురిని షీజాన్ వాడుకుని వదిలేశాడని, మరో మహిళతో సంబంధం కొనసాగిస్తూనే తునిషాదో ప్రేమాయణం నడిపాడని ఆమె ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుకుంటోంది.
MLAs Bribe Case: ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టు ట్విస్ట్.. అందుకు గ్రీన్ సిగ్నల్