Site icon NTV Telugu

Hyderabad Crime: 8 ఏళ్ల అంధ బాలికపై అత్యాచారం.. వెలుగులోకి దారుణ విషయాలు..!

Minor Rape

Minor Rape

Hyderabad Crime: కీచకుల కామ దాహానికి అడ్డు లేకుండా పోతోంది. ఎక్కవ పడితే అక్కడ.. ఎవరిపై పడితే వారిపై పిచ్చికుక్కల్లా ఎగబడుతున్నారు. కామవాంఛ తీర్చుకునేందుకు.. అవతలి వ్యక్తి ఎవరనేది కూడా చూడటం లేదు. వృద్ధురాలు, పసిపిల్లలపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులున్న లోకమిది. ఇలాంటి మరో దారుణ ఘటన మలక్‌పేట్‌ పరిధిలో చోటుచేసుకుంది. మలక్‌పేట్‌లోని ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్‌!! ఇందులో బాత్‌రూమ్‌లు కడిగేందుకు వచ్చిన ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. హాస్టల్‌ లో ఉన్న ఎనిమిదేళ్ల అంధ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక అస్వస్థతకు గురైంది. విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు హాస్టల్‌ అధికారులు. బాలిక ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. మీ పాపకు ఆరోగ్యం బాగోలేదని వికారాబాద్‌లో ఉండే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్‌ చేరుకున్న పేరెంట్స్‌ తమ కూతురుతో మాట్లాడటంతో అసలు విషయం బయటపడింది.

Read Also: ఆఫ్టర్ మ్యారేజ్ ఆడవాళ్లు గూగుల్లో ఎక్కువగా వెతికేవి ఏంటో తెలుసా..?

దీంతో, హాస్టల్‌ నిర్వాహకులను నిలదీశారు బాలిక తల్లిదండ్రులు. సమాధానం చెప్పకుండా దాటవేశారు. తమ కూతురుపై అత్యాచారం జరిగిందని మలక్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించలేదు. బాలిక అంధురాలు కాబట్టి.. బాలిక చెప్పిన మాటలు నమ్మలేం.. ఊరికి తీసుకెళ్లి వైద్యం చేయించండి అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు పోలీసులు. చేసేదేమీ లేక తల్లిదండ్రులు బాలికను వికారాబాద్‌ తీసుకెళ్లి అక్కడి ఆస్పత్రిలో చూపించారు. ఎంతకీ రక్తస్రావం ఆగకపోవడంతో హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన నీలోఫర్‌ వైద్యులు.. బాలికపై అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులకు చెప్పడంతోపాటు.. మలక్‌పేట పోలీసులకు కూడా సమాచారమిచ్చారు. నీలోఫర్‌ వైద్యులుచెప్తే కానీ పోలీసుల్లో కదలిక రాలేదు. ఈనెల 16న పోక్సో కేసు నమోదు చేశారు.

Read Also: Off The Record: రూటు మారుస్తున్న జగన్.. పెద్ద స్కెచ్చే వేశారా..?

ఘటన జరిగిన 15 రోజుల తర్వాత కానీ.. కామాంధుడు నరేష్‌ను అదుపులోకి తీసుకోలేదు పోలీసులు. అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో… స్థానిక నేతలు, ఏబీవీపీ ప్రతినిధులు మలక్‌పేట పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. ఘటనపై మలక్‌పేట పోలీసులు విచారణ జరుపుతున్నారని దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజేందర్‌ ఓ ప్రకటన చేసి చేతులుదులుపుకున్నారు. ఇంతటి దారుణం జరిగినా ఉన్నతాధికారుల్లోనూ ఎలాంటి చలనం లేదు. తోటి విద్యార్థినికి జరిగిన అఘాయిత్యంతో హాస్టల్‌లో ఉండే ఇతర విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు.

Exit mobile version