Hyderabad Crime: రౌడీషీటర్ దారుణ హత్య.. కారణం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rowdy Sheeter Ayaz Attacked By A Group In Hyderabad Old City: హైదరాబాద్ పాతబస్తీలో ఒక రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ ప్రాంతంలో కాలాపత్తర్ రౌడీ షీటర్ ఆయాజ్ అలియాస్ అబ్బు మినీ ట్రక్ వాహనం నడుపుకుంటూ వెళ్తుండగా.. గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేశారు. తొలుత అతని కళ్లల్లో కారం కొట్టి బయటకు లాగిన దుండగులు.. తమతో తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. అబ్బు చనిపోయాడన్న విషయాన్ని నిర్ధారించుకొని.. అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంని పిలిపించి, ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
IT Layoffs Live: ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం.. ఊడుతున్న ఉద్యోగాలు
Also Read
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
- Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్‌స్టా స్టోరీ!
- Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
అబ్బు హత్యకు పాతకక్ష్యలే కారణం అయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అబ్బు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. బహుశా అవతలి వర్గానికి చెందిన వారు.. అతడ్ని చంపి, తమ ప్రతీకారం తీర్చుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. లేకపోతే అబ్బు మీద మరెవరైనా పగ పెంచుకొని, ఈ దారుణానికి పాల్పడి ఉంటారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు.. ఘటన స్థలాన్ని చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్ పరిశీలించారు. కాగా.. అబ్బు మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాతబస్తీలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ హత్య పాతబస్తీలో అల్లర్లకు దారితీస్తుందేమోనని భయపడుతున్నారు. అయితే.. అలాంటివి జరగకుండా ఉండేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Raviteja: మాస్ మహారాజ పాన్ ఇండియా సినిమా షూటింగ్… నైట్ ఎఫెక్ట్ లో
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో రాముడి విగ్రహ వివాదం.. రాడికల్ ఇస్లామిస్ట్‌ల బెదిరింపులు..
-
KTR : ఒక్క ఓటు కూడా పోవద్దు.!
-
Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Peddi : థియేటర్లలో ‘పెద్ది’ సరికొత్త రచ్చ.. రేపటి నుంచి 6 నిమిషాల కొత్త సీన్స్ లోడింగ్,
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!