Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఓ గిరిజన మహిళను ఆమె భర్త నగ్నంగా చేసి బహిరంగం ఊరేగించారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ దారుణానికి పాల్పడిన భర్తతో పాటు బాధిత మహిళ అత్తమామాలను అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బహిరంగంగా కొట్టి, బట్టలు విప్పి నగ్నంగా ఊరేగించాడు. ఈ ఉదంతాన్ని పలువరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ కేసులో భర్త కనా మీనా, మరో ఇద్దరు నాథు మీనా, వెలియా మీనాగాలను నిందితులుగా గుర్తించారు. అరెస్ట్ చేసే క్రమంలో వీరు తప్పించుకునే ప్రయత్నం చేయగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారు.
Read Also: Horse Viral Video: మొదటిసారి అద్దంలో చూసుకున్న గుర్రం.. ఏం చేసిందంటే?
ఈ ఘటన సోమవారం జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది పెళ్లి చేసుకున్న మహిళ, పక్కింటి వ్యక్తితో పారిపోయిందని భర్త, అత్తామామాలు కొట్టారు. దీంతో వీరంతా కలిసి మహిళలను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన వైరల్ గా మారడంతో, ఇకపై ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయవద్దని ప్రతాప్‌గఢ్ పోలీసులు కోరారు. ఈ ఘటనలో భర్త, అత్తామామలతో పాటు మొత్తం 10 మందిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 294 (అశ్లీల చట్టం), 354 (మహిళలపై దాడులు), 365 (కిడ్నాప్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 (అసభ్యకరమైన విషయాలను ప్రసారం చేయడం) కింద కేసు నమోదు చేశారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. పెళ్లయినా మరో వ్యక్తితో కలిసి తన భార్య వెళ్లిపోయిందనే కోపంతో మహిళ అత్తమామలు ఆమెను కిడ్నాప్ చేసి తమ గ్రామానికి తీసుకెళ్లి కొట్టి నగ్నంగా ఊరేగించారని రాజస్థాన్ డీజీపీ ఉమేష్ మిశ్రా తెలిపారు. దీన్ని హేయమైన చర్యగా అభిర్ణించారు. ఈ ఘటన పొలిటికల్ దుమారాన్ని రేపింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దీనిపై స్పందిస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించారు. మరో బీజేపీ నేత అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే రాహుల్ గాంధీ, గెహ్లాట్ రాజీనామాను ఎప్పుడు కోరుతారని ప్రశ్నించారు.