Pune: ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం డిమాండ్.. వేధింపులతో వివాహిత మృతి..!
- అత్తింటి వారి వేధింపులతో వివాహిత ఆత్మహత్య..
- ఘటనపై మృతురాలి కుటుంబీకుల అనుమానాలు..
- ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం కావాలని వేధింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune: మహారాష్ట్రలోని పుణెలో 34 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఓ అపార్ట్మెంట్లో ఉరివేసుకున్న స్థితిలో ఆమె కనిపించింది. పెళ్లయినప్పటి నుంచి అత్తింటి వారి వేధింపులు కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం కట్నంగా ఇవ్వాలని వేధిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల నేపథ్యంలో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
మృతురాలిని పాయల్ జాంబ్రే పాటిల్‌గా గుర్తించారు. ఆమె గతంలో ఐటీ ఉద్యోగినిగా పనిచేసేవారని, తర్వాత ఉద్యోగం మానేశారని పోలీసులు తెలిపారు. ఆమెకు అక్షయ్ జాంబ్రే పాటిల్‌తో వివాహమైంది. ఈ ఇద్దరికి ఒక కుమార్తె ఉన్నారు. అయితే, పాయల్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను హత్య చేసిన అత్తింటివారే ఉరివేశారని కుటుంబీకులు ఆరోపించారు. పోలీసులు మాత్రం ప్రస్తుతం ఆత్మహత్యకు ప్రేరేపించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Hyderabad: రూ.6.78 కోట్ల నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్..
- Shraddha Walkar Case: శ్రద్ధా వాకర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడు అఫ్తాబ్‌కు భద్రత పెంపు!
- Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
- Hyderabad: మద్యం మత్తులో దారుణం.. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన తండ్రి..!
ఆదివారం పాయల్‌కు తన అత్తతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం అత్తింటివారు, పాయల్ బంధువులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో దంపతులు నివసించే ఇంటికి సమీపంలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ గదిలో పాయల్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు వెల్లడించారు.
పాయల్‌ను హత్య చేసి ఉంటారని ఆమె మామయ్య ఆరోపించారు. భర్త, అత్తమామలే ఆమెను చంపి ఫ్లాట్‌లో ఉరివేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. పాయల్ అత్త పెళ్లయినప్పటి నుంచి వేధించేదని, తాము రైతులమని, కరువు పరిస్తితి కారణంగా వెంటనే ఆ డిమాండ్ తీర్చలేకపోయామని చెప్పారు. వచ్చే ఏడాది బంగారం ఇస్తామని హామీ ఇచ్చామని చెప్పారు. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో కూడా మగ బిడ్డకు జన్మనివ్వాలని వేధించారని పాయల్ కుటుంబీకులు ఆరోపించారు. పాయల్ ఆడబిడ్డకు జన్మనివ్వడంతో, ఆ బిడ్డను మేము పట్టించుకోమని ఆమె అత్తమామలు చెప్పినట్లు పాయల్ కుటుంబీకులు వెల్లడించారు. ప్రస్తుతం స్వర్గేట్ పోలీసులు పాయల్ భర్త అక్షయ్, అత్తమామలపై కేసు నమోదు చేశారు. అక్షయ్‌ను అరెస్ట్ చేశారు. అత్తామామల కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
ట్రెండింగ్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!