NTV Telugu Site icon

Pune: ప్రపోజల్‌ని తిరస్కరించిందని గర్ల్‌ఫ్రెండ్‌పై కొడవలితో దాడి..

Pune

Pune

Pune: తనతో సంబంధాన్ని నిరాకరించినందుకు ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ పై దాడికి తెగబడ్డాడు. మంగళవారం ఈ ఘటన పూణేలోని సదాశివపేట ప్రాంతంలో జరిగింది. బాధితురాలు, నిందితుడు ఇద్దరు మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. తనతో సన్నిహితంగా ఉండేందుకు నిరాకరించినందుకు సదరు వ్యక్తి యువతిపై దాడికి చేశాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Air India Flight: ఎయిరిండియా విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. నిందితుడు అరెస్ట్

నిందితుడు తన స్నేహితుడని బాధితురాలు తెలిపింది. తనతో రిలేషన్ షిప్ లో ఉండాలని అతడు ప్రపోజ్ చేశాడని, అందుకు తాను తిరస్కరించానని, అప్పుటి నుంచి నన్ను బెదిరించడం మొదటుపెట్టాడని బాధితురాలు పేర్కొంది. తనకు కాల్ చేసేవాడని, తనను కాలేజ్ వెలుపల కొట్టేవాడని, ప్రపోజ్ తిరస్కరించినా నావెంట పడేవాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయంపై అతని కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశానని, కానీ వారెవరూ కూడా చర్యలు తీసుకోలేదని, అతని కుటుంబానికి ఫిర్యాదు చేసినందుకు నాపై కొడవలితో దాడి చేశాని ఆమె తెలిపింది.

మంగళవారం నాతో 5 నిమిషాలు మాట్లాడాలని సదరు వ్యక్తి పలిచాడని.. ఆ సమయంలోనే నాపై కొడవలితో దాడి చేశాడని, అక్కడే ఉన్న కొంతమంది అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించినా.. తప్పించుకుని మళ్లీ దాడి చేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది. ఈ దాడిలో యువతికి చేతికి, తలకు గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే యువతి అక్కడి నుంచి ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీసింది. ఆమె వెనుకే నిందితుడు కొడవలి పట్టుకుని పరిగెత్తుతున్న సమయంలో లేష్పాల్ ఖిబాగే అనే మరో వ్యక్తి నిందితుడిని అడ్డుకుని అమ్మాయి ప్రాణాలు కాపాడాడు.

Show comments