Air India Flight: ఎయిరిండియా విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Flight Urination Incident: విమానంలో మూత్ర విసర్జన చేసిన మరో ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మూత్ర విసర్జన చేశాడు. అనంతరం అక్కడే ఉమ్మివేశాడు. ప్రయాణికుడి దుష్ప్రవర్తనను గమనించిన క్యాబిన్ సిబ్బంది.. అతడిని హెచ్చరించారు. తోటి ప్రయాణికులు అతడి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విమాన సిబ్బంది.. దిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు.ముంబై నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన జరగడంతో నిందితుడిని ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లోని పోలీస్ స్టేషన్లో ఫ్లైట్ కెప్టెన్ తరపున ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు నిందితుడిని అక్కడి నుంచి అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు రామ్ సింగ్ అని చెప్పారు.
నిందితుడిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో నిందితుడు ఆఫ్రికాలో కుక్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. ఈ ఘటన జూన్ 24న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘ఎయిర్ ఇండియా సిబ్బంది ఫిర్యాదు చేయడం వల్ల నిందితుడిని అరెస్టు చేశాం. అనంతరం కోర్టులో హాజరు పరిచాం. కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ జరుగుతోంది’ పోలీసులు వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. రామ్ సింగ్ అనే ప్రయాణికుడు విమానంలో మూత్ర విసర్జన చేసి ఆపై ఉమ్మివేసాడు. ఈ సమయంలో సిబ్బంది ప్రయాణికుడికి మౌఖిక వార్నింగ్ ఇచ్చారని, అయినప్పటికీ అతను ఆగలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
Also Read
- Afghanistan Tri Series Win: అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్థాన్.. ట్రై సిరీస్ కైవసం..
- Ishan Kashan Replace: గాయంతో మ్యాచ్‌కు దూరమైన ఇషాన్ కిషన్.. అతడి స్థానంలో కీలక ప్లేయర్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ..
- Ankeet Bawane: వరుసగా రెండు సెంచరీలు (150+, 200).. రంజీల్లో తిరుగులేని ప్లేయర్‌గా రికార్డు..
- Andhra Pradesh Cyclone Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీకి తుఫాన్ ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
Also Read: Uttar Pradesh: బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిపై బుల్డోజర్ యాక్షన్..
సమాచారం ప్రకారం.. నిందితుడు ఆఫ్రికాలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఎయిర్ ఇండియా విమానం AIC 866 ముంబై- ఢిల్లీ విమానంలో ప్రయాణించాడు. ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఫ్లైట్ కెప్టెన్ ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు సెక్షన్ 294/510 కింద కేసు నమోదు చేశారు. నిందితుడైన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిని కోర్టులో హాజరుపరచగా, అక్కడి నుంచి బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందని తెలిపారు.
Also Read: Mamata Benerjee: మమతా బెనర్జీకి తప్పిన ప్రమాదం.. ఉత్తర బెంగాల్లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
విమానంలో ఇలా అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి. ఏప్రిల్‌లో అమెరికన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానంలో ఇలాంటి ఘటన జరిగింది. అమెరికా నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు.. మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు సమాచారం అందించారు. అనంతరం నిందితుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్ తరలించారు. గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్ సీటులో కూర్చున్న ఓ వృద్ధురాలిపై శంకర్ మిశ్రా అనే ఓ వ్యక్తి మూత్రం పోశాడు. ఈ ఘటనను తీవ్రంగా ఆక్షేపిస్తూ బాధితురాలు టాటా గ్రూప్ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద దూమారం రేపింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎయిర్ఇండియాను ఆదేశించింది. ఈ ఘటనలో ఎయిర్ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది డీజీసీఏ. దీంతో పాటు ఆ విమాన పైలట్ లైసెన్సును 3 నెలలపాటు సస్పెండ్ చేసింది. తన విధులు సరిగ్గా నిర్వర్తించనందుకు గాను ఎయిర్ ఇండియా ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్‌కు డీజీసీఏ రూ.3లక్షల జరిమానా విధించింది.
తాజావార్తలు
-
Afghanistan Tri Series Win: అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్థాన్.. ట్రై సిరీస్ కైవసం..
-
Ishan Kashan Replace: గాయంతో మ్యాచ్‌కు దూరమైన ఇషాన్ కిషన్.. అతడి స్థానంలో కీలక ప్లేయర్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ..
-
IND vs NZ 2nd T20I: నేడు భారత్-న్యూజిలాండ్ రెండో టీ20.. లైవ్ స్ట్రీమింగ్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 ఇదే!
-
Ankeet Bawane: వరుసగా రెండు సెంచరీలు (150+, 200).. రంజీల్లో తిరుగులేని ప్లేయర్‌గా రికార్డు..
-
Andhra Pradesh Cyclone Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీకి తుఫాన్ ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!