కిచెన్ లో ఓ మహిళ ప్రెషర్ కుక్కర్ ను స్టౌ మీద పెట్టింది. అనుకోకుండా అది పేలిపోయింది. అదృష్టవశాత్తు ఆమె కొంచెం దూరంగా ఉండడంతో.. పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also:Gujarat Honour Killing: తల్లి, తోడబుట్టిన అన్న కలిసి.. కుమార్తెను ఏం చేశారో తెలుసా..
పూర్తి వివరాల్లోకి వెళఇతే.. చెన్లో పని చేస్తూ ఉన్న మహిళ వంట మధ్యలో కుక్కర్ ఒక్కసారిగా పేలిపోయింది. వీడియోలో, ఆమె కొద్ది సెకన్ల ముందు అక్కడి నుండి పక్కకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. వంట చేస్తుండగా కుక్కర్ బ్లాస్ట్ అవ్వడంతో కిచెన్ సామాన్లు చెల్లచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాకపోవడం అదృష్టమనే చెప్పుకోవాలి. నెటిజన్లు ఈ వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్నారు. కుక్కర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని .. కొంచెం అజాగ్రత్తగా ఉన్న పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని కామెంట్లుపెడుతున్నారు. పాత కుక్కర్లు పడేయబుద్ది కాకపోతే ఇలాగే జరుగుతుందని, మూడు నాలుగు ఏళ్లు వాడాక సేఫ్ సైడ్ కోసం కుక్కర్ చేంజ్ చేయడం బెస్ట్ అని శ్రీనివాస్ అనే ఎక్స్ యూజర్ వీడియో పోస్ట్ చేసి తన అభిప్రాయం తెలిపారు. ఈ కామెంట్‌పై పలువురు యూజర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
Read Also:Eswatini’s King: ఆడు.. మగాడ్రా బుజ్జి… ఏకంగా 15 మంది భార్యలతో..
పాత కుక్కర్.. కొత్త కుక్కర్ అని తేడా ఉండదని.. కొన్ని క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ వల్ల అనర్థాలు జరుగుతాయని మరో నెటిజన్ కామెంట్ చేశారు. కుక్కర్ బ్లాస్ట్ విజిల్ సమస్య వల్ల ఇలా జరుగుతుందని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. తాము పదిహేను ఏళ్ల నుంచి పాత కుక్కర్ వాడుతున్నామని, కుక్కర్ ఆపరేటరింగ్ కరెక్ట్ గా తెలియకపోతే.. ప్రమాదాలని కొని తెచ్చుకోవాల్సి వస్తుందని.. కొందరు కామెంట్ చేస్తున్నారు. కుక్కర్లో ఆహారం అధికంగా నింపకూడదు, సేఫ్టీ వాల్వ్ సరిగా ఉందో లేదో తరచుగా తనిఖీ చేయాలి, అలాగే స్టీమ్ విడుదలైన తర్వాత మాత్రమే మూత తీసుకోవాలని ప్రెజర్ కుక్కర్ వాడే వారికి నిపుణులు సూచించారు.
పాత cooker పడేయబుద్ది కాకపోతే ఇలాగే జరుగుతుంది.
మూడు నాలుగు ఏళ్ళు వాడాక safe side కోసం change చేయడం best practice. pic.twitter.com/Js6ZdP4w0b— srinivas night owl🦉 (@NeverSayYesDude) October 23, 2025