Police Harassment: ఓ కేసులో పోలీసులు చిత్రహింసలు.. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
- యూపీలోని ఆగ్రాలో ఓ సంచలన కేసు
- పోలీసుల వేధింపులతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య
- బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూపధాను గ్రామంలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఆగ్రాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసుల వేధింపులతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూపధాను గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఏసీపీ డా.సుకన్య శర్మ, బర్హాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Read Also: CRIME: ప్రియురాలి సోదరుడితో కలిసి పెళ్ళాన్ని హతమార్చిన భర్త..
Also Read
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రూప్‌ధానుకు చెందిన సంజయ్‌సింగ్ కొద్దిరోజుల క్రితం హత్రాస్‌లోని సదాబాద్‌కు చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడు. అప్పటి నుంచి ఆ కేసులో అతడిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా.. జూన్ 9న పోలీసులు తన ఇంటి నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో తీవ్రంగా కొట్టారు. జూన్ 22లోగా బాలికను తీసుకురావాలని చెప్పారు. అయితే.. ఆ భయంతో ఈరోజు ఉదయం సంజయ్ పొలంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Read Also: Nirmala Sitharaman: రాహుల్ గాంధీ ఎక్కడ..? తమిళనాడు కల్తీ మద్యం మరణాలపై కాంగ్రెస్ మౌనం ఎందుకు ..?
మరోవైపు.. ఘటనాస్థలానికి వందల సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. సమాచారం అందుకున్న డీఎస్పీ డాక్టర్ సుకన్య శర్మ, పోలీస్‌స్టేషన్ హెడ్ రాజీవ్ రాఘవ్, బలగాలతో అక్కడికి చేరుకున్నారు. అనంతరం.. మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అనుమతించలేదు. సదాబాద్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం.. ఈ ఘటనపై అమేథీ ఎస్పీ ఇన్‌హౌనా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఒక చీఫ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
తాజావార్తలు
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
New Railway Line: రైల్వే ప్రయాణికులకు అదిరే న్యూస్.. 17 కి.మీ మేర కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్..
-
Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
-
Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
ట్రెండింగ్
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!