NTV Telugu Site icon

Police Harassment: ఓ కేసులో పోలీసులు చిత్రహింసలు.. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Up

Up

యూపీలోని ఆగ్రాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసుల వేధింపులతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూపధాను గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఏసీపీ డా.సుకన్య శర్మ, బర్హాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Read Also: CRIME: ప్రియురాలి సోదరుడితో కలిసి పెళ్ళాన్ని హతమార్చిన భర్త..

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రూప్‌ధానుకు చెందిన సంజయ్‌సింగ్‌ కొద్దిరోజుల క్రితం హత్రాస్‌లోని సదాబాద్‌కు చెందిన మైనర్‌ బాలికను కిడ్నాప్ చేశాడు. అప్పటి నుంచి ఆ కేసులో అతడిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా.. జూన్ 9న పోలీసులు తన ఇంటి నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో తీవ్రంగా కొట్టారు. జూన్ 22లోగా బాలికను తీసుకురావాలని చెప్పారు. అయితే.. ఆ భయంతో ఈరోజు ఉదయం సంజయ్ పొలంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read Also: Nirmala Sitharaman: రాహుల్ గాంధీ ఎక్కడ..? తమిళనాడు కల్తీ మద్యం మరణాలపై కాంగ్రెస్ మౌనం ఎందుకు ..?

మరోవైపు.. ఘటనాస్థలానికి వందల సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. సమాచారం అందుకున్న డీఎస్పీ డాక్టర్‌ సుకన్య శర్మ, పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ రాజీవ్‌ రాఘవ్‌, బలగాలతో అక్కడికి చేరుకున్నారు. అనంతరం.. మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అనుమతించలేదు. సదాబాద్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం.. ఈ ఘటనపై అమేథీ ఎస్పీ ఇన్‌హౌనా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఒక చీఫ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.

Show comments