Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్‌గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palnadu Police Crime: పల్నాడు జిల్లాలో వరుస ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు స్వయంగా నేర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా చిలకలూరిపేట సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన న్యాయవాది హత్య కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకట కోటయ్యకు హత్యకు గురైన లాయర్ భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న లాయర్ తరచూ భార్యతో గొడవపడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని సమాచారం.
Read Also: Hungary Election Results: హంగేరీలో ఓర్బన్ శకం ముగిసింది.. యువ నేత పీటర్ మాగ్యార్ సంచలన విజయం!
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ఈ పరిణామాలతో లాయర్‌ను అడ్డు తొలగించుకోవాలని వెంకట కోటయ్య కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు మరో కానిస్టేబుల్ కొండారెడ్డి శ్రీనివాసరావు సహకరించినట్లు వెల్లడైంది. ఇందుకోసం రూ.5 లక్షలు తీసుకుని హత్యలో సహకరించినట్లు సమాచారం. ఈ కేసులో ఇద్దరినీ చిలకలూరిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇక, పల్నాడు జిల్లాలో ఇటీవల పోలీసులపై వస్తున్న ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని భర్త నుంచి వేరు చేసి ఆమె తల్లిదండ్రులకు అప్పగించగా, అనంతరం ఆమెను తండ్రి, మేనబావ హత్య చేసిన కేసులో గత వారం మాచర్ల రూరల్ సీఐను సస్పెండ్ చేశారు.
అదేవిధంగా ప్రేమ జంటలను బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలతో మాచర్ల టౌన్ ఏఎస్ఐను ఐజీ నిన్న సస్పెండ్ చేశారు. వరుసగా పోలీసులపై నేర ఆరోపణలు వెలుగులోకి వస్తుండటంతో పల్నాడు జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!