Hungary Election Results: హంగేరీలో ఓర్బన్ శకం ముగిసింది.. యువ నేత పీటర్ మాగ్యార్ సంచలన విజయం!
- యువ నేత దెబ్బకు దిగివచ్చిన 'ఉక్కు మనిషి'
- హంగేరీ ఎన్నికల్లో విక్టర్ ఓర్బన్ ఘోర పరాజయం
- గత 16 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా ఉన్న విక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hungary Election Results: హంగేరీ రాజకీయాల్లో దశాబ్ద కాలానికి పైగా సాగిన విక్టర్ ఓర్బన్ శకానికి తెరపడింది. యువ నాయకుడు పీటర్ మాగ్యార్ ప్రభంజనంతో హంగేరీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా జరిగిన హంగేరీ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. గత 16 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా ఉన్న సీనియర్ జాతీయవాద నేత విక్టర్ ఓర్బన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ‘టిస్జా’ పార్టీకి చెందిన యువ సంచలనం పీటర్ మాగ్యార్ ఈ ఎన్నికల్లో విజయ కేతనంతో హంగేరీ రాజకీయాలను మలుపు తిప్పారు.
READ ALSO: Athidhi Re-release: మహేష్ బాబు ‘అతిథి’ రీ-రిలీజ్.. మణిశర్మ సరికొత్త మ్యాజిక్!
Also Read
రికార్డు మెజారిటీతో క్లీన్ స్వీప్
హంగేరీలోని 199 స్థానాలు గల శాసనసభలో పీటర్ మాగ్యార్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఓట్ల లెక్కింపు తుది దశకు వచ్చేసరికి టిస్జా పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఏకంగా 138 స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. బుడాపెస్ట్‌లోని డాన్యూబ్ నది ఒడ్డున చేరిన వేలాది మంది మద్దతుదారుల మధ్య మాగ్యార్ తన విజయాన్ని ప్రకటించారు. “మనం సాధించాం! ఈ ఎన్నికల్లో టిస్జా – హంగేరీ గెలిచాయి. ఓర్బన్ పాలన నుంచి దేశానికి విముక్తి లభించింది” అని మాగ్యార్ చెప్పారు.
ఓర్బన్ ఓటమికి కారణాలు ఇవే..
“ఉదారవాద వ్యతిరేక ప్రజాస్వామ్యం” కి ప్రతిరూపంగా నిలిచిన ఓర్బన్ ఈసారి ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక మందగమనం ప్రజల్లో ఆయన పట్ల అసంతృప్తిని పెంచింది. ఓర్బన్ విధానాల వల్ల హంగేరీ అంతర్జాతీయంగా ఒంటరైందన్న భావన దేశ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఆయనకు వ్యతిరేకంగా మాగ్యార్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడటం, ప్రజాస్వామ్య సంస్కరణల దిశగా అడుగులు వేస్తానని హామీ ఇవ్వడం ఈ ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉక్రెయిన్‌కు ఉపశమనం..
ఓర్బన్ ఓటమితో యూరోపియన్ యూనియన్ (EU) లో హంగేరీ వ్యవహరిస్తున్న వైఖరికి తెరపడనుంది. గతంలో ఉక్రెయిన్‌కు అందాల్సిన 90 బిలియన్ యూరోల ($105 బిలియన్) రుణాన్ని ఓర్బన్ అడ్డుకున్నారు. ఇప్పుడు పీటర్ మాగ్యార్ అధికారంలోకి రావడంతో ఈ నిధుల విడుదలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉందని సమాచారం. హంగేరీ తిరిగి యూరోపియన్ యూనియన్‌లో చేరడం వల్ల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తన ఓటమిని అంగీకరిస్తూ ఓర్బన్ భావోద్వేగ ప్రకటన చేశారు. “ఈ ఫలితాలు మాకు చాలా బాధాకరమైనవి, కానీ ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!