Operation Octopus: 16 రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసుల గర్జన.. 100 మందికి పైగా సైబర్ కేటుగాళ్లు అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Octopus: తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఏకకాలంలో 16 రాష్ట్రాల్లో సోదాలు జరిపి అతిపెద్ద సైబర్ క్రైమ్ ముఠాను పట్టుకున్నారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో వంద మందికి పైగా సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. ఇందులో మ్యూల్ అకౌంట్ హాల్డర్లు, బ్యాంక్ అధికారులు, అకౌంట్ సప్లయర్స్, సైబర్ నేరగాళ్లు ఉన్నారు. ఇందులో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఫొటోలతో నేరాలకు పాల్పడుతున్న ముఠా, డిజిటల్ అరెస్ట్‌లతో పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలున్నాయి. వంద మందికి పైగా నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వందలాది బ్యాంక్ అకౌంట్లు, ల్యాప్‌టాప్‌లు, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, వందలాది సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేశారు.
READ ALSO: Family Su*cide: ఆర్థిక భారమే కారణమా? భయంతో ముగ్గురు సూసైడ్‌కు పాల్పడ్డారా?
Also Read
- Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
ఇటీవల డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో మోసాలు, సెలబ్రిటీలు, ప్రముఖుల ఫొటోలు, వీడియోలతో నేరాలకు పాల్పడుతున్న కేసులు అధికం అవడంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ నెట్‌వర్క్ ఆపరేట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, వెస్ట్‌బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యాణా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాలను గుర్తించారు. ఈ రాష్ట్రాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు 32 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి ఆపరేషన్ ఆక్టోపస్ నిర్వహించారు.
ఈ రాష్ట్రాల్లో ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను గుర్తించి ఏకకాలంలో సోదాలు జరిపారు. మొత్తం 16 రాష్ట్రాలకు చెందిన 104 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలు ఇప్పటివరకు 1055 సైబర్ నేరాలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ ముఠాల నుంచి 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డ్స్, 152 బ్యాంక్ పాస్‌బుక్స్, 234 క్రెడిట్, డెబిట్ కార్డులు, 26 ల్యాప్‌టాప్‌లు, 56 కార్పొరేట్ స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నారు. 36 లక్షల నగదును సీజ్ చేశారు. డిజిటల్ అరెస్ట్‌లకు పాల్పడుతున్న నేరగాళ్లతో పాటు.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వీడియోలతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు ఉన్నట్లు చెబుతున్నారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. ఈ సైబర్ నేరగాళ్లకు పలు బ్యాంక్‌లకు చెందిన అధికారులు సహకరిస్తున్నట్లు గుర్తించి వాళ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్స్ సప్లై చేస్తున్న వ్యక్తులను కూడా గుర్తించారు పోలీసులు.
READ ALSO: Marriage Frauds : హైదరాబాద్‌లో బయటపడ్డ షాదీ డాట్ కామ్ మోసగాడు, కిలేడీ పాస్టర్ లీలలు!
- Tags
తాజావార్తలు
-
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!