NTV Telugu Site icon

Online Scam: అందమైన ఫొటోలతో ఇస్టాన్‌లో వల.. నమ్మితే జేబులు గుల్ల..!

Crime

Crime

Online Scam: సోషల్‌ మీడియాలో ఏది నిజమో ఏ అబ్దమో తెలియని పరిస్థితి ఏర్పడింది.. ఏ అందమైన ప్రకటన వెనుక ఏ మోసం దాగి ఉందో..? ఏ అందమైన అమ్మాయి చాటింగ్‌, వీడియో కాల్‌ వెనుక ఏ కుట్ర కోణం దాగి ఉందో కనిపెట్టడమే కష్టంగా మారిపోయింది.. తాజాగా గుంటూరులో మరో మోసం వెలుగు చూసింది.. ఇంటి దగ్గర ఉండే డబ్బులు సంపాదించొచ్చు అని ఆశ పడిన యువత.. ఆ వర్క్‌ ఫ్రమ్‌ హోం విషయం ఏమో గానీ.. జేబులు మాత్రం ఖాళీ చేసుకున్నారు..

Read Also: LLC 2024: గబ్బర్‌ గర్జించినా.. గుజరాత్‌ గ్రేట్స్‌కు తప్పని ఓటమి!

గుంటూరులో వెలుగు చేసిన నయా మోసానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇంస్టాగ్రామ్ లో వర్క్ ఫ్రమ్ హోమం అంటూ యువకులకు వల వేస్తున్నారు.. మీరు ఇంట్లో కూర్చొనే నెలకు 50,000 వేల వరకు సంపాదించుకోవచ్చు అంటూ ఓ ప్రకటన ఇచ్చారు.. తమను సంప్రదించిన యువకులకు.. అందమైన యువతీతో వీడియో సందేశాలు పంపించారు.. ఇలా యువతను ఆకర్షించేందుకు ఆన్‌లైన్‌లో స్కామ్‌లతో కొత్త ఎత్తులు వేశారు.. అయితే, ఈ టీంలో చేరాలంటే విడతల వారీగా డబ్బు చెల్లించాలని ఒక్కొక్కరి నుంచి రూ.12,000 వసూలు చేశారు.. సోప్‌లు, కూల్‌డ్రింక్స్‌, తదితర కిరణా వస్తువులు, తక్కువ ధరకే ఇస్తామని.. 50 వేల రూపాయల విలువైన సరుకులు పాతిక వేలకు ఇస్తామని, నమ్మించి డబ్బు జమ చేయించుకుంది ఆన్‌లైన్‌ ముఠా.. ఇక, ఆ మొత్తాన్ని జమ చేసిన తర్వాత తమ ఫోన్లకు ఎలాంటి రిప్లే ఇవ్వకపోవడంతో.. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.