LLC 2024: గబ్బర్ గర్జించినా.. గుజరాత్ గ్రేట్స్‌కు తప్పని ఓటమి!
- శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ
- గుజరాత్ గ్రేట్స్‌కు తప్పని ఓటమి
- చతురంగ డిసిల్వ ఫిఫ్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తున్న గుజరాత్ గ్రేట్స్ టీమ్.. దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని సథరన్ సూపర్ స్టార్స్‌పై ఓడిపోయింది. గబ్బర్ హాఫ్ సెంచరీతో గర్జించినా గుజరాత్ గ్రేట్స్‌కు ఓటమి తప్పలేదు. 37 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ధావన్.. 48 బంతుల్లో 108.33 స్ట్రైక్ రేట్‌తో 52 పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన గబ్బర్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. చతురంగ డిసిల్వ (53 నాటౌట్; 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ద సెంచరీ చేశాడు. మార్టిన్ గప్తిల్ (22), హమిల్టన్ మసకద్జ (20), దినేశ్ కార్తీక్ (18) పరుగులు చేశారు. గుజరాత్ గ్రేట్స్ బౌలర్లలో మనన్ శర్మ 6 వికెట్లు పడగొట్టాడు.
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
లక్ష్య ఛేదనలో గుజరాత్ గ్రేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. శిఖర్ ధావన్ మినహా మిగతావారెవరూ రాణించలేదు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన మోర్నీ వాన్ విక్ (15) త్వరగా అవుట్ అవ్వడం దెబ్బకొట్టింది. లెండిల్ సిమన్స్ (7), మొహమ్మద్ కైఫ్ (5), అస్గర్ అఫ్ఘాన్ (3), మనన్ శర్మ (10) విఫలమయ్యారు. సథరన్ సూపర్ స్టార్స్ బౌలర్లలో పవన్ నేగి 3, అబ్దుర్ రజాక్ 2 వికెట్స్ తీశారు.
తాజావార్తలు
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్‌లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!