Site icon NTV Telugu

Triangle Love: ఒక యువతిని ప్రేమించిన ఇద్దరు విద్యార్థులు.. స్నేహితుడు హత్య

Trianglelove

Trianglelove

ట్రయాంగిల్ లవ్ కారణంగా ఒక స్నేహితుడు బలైపోయాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. డీఎంకే నేత మనవడు సహా మరో ముగ్గురు నిందితులు అరెస్ట్ కాగా.. ఇంకొకరి కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kolkata: బంగ్లాదేశ్ మోడల్ శాంతా పాల్ అరెస్ట్.. పోలీస్ కస్టడీకి అప్పగింత

ఇద్దరు విద్యార్థులు.. ఒక విద్యార్థినిని ప్రేమిస్తున్నారు. దీంతో రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే అందులో ఒక ప్రేమికుడు చంద్రు…డీఎంకే కౌన్సిలర్ మనవడు సహాయం కోరాడు. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిని బెదిరించాలని కోరాడు. దీంతో సోమవారం చెన్నైలో రేంజ్ రోవర్ కారులో బయల్దేరారు. ప్రత్యర్థి వర్గం రెండు బైక్‌లపై వెళ్తున్నారు. అయితే ప్రత్యర్థి ప్రేమికుడు వెంకటేశన్‌ను చంపబోయి.. అతడి స్నేహితుడు నితిన్ సాయిను చంపేశారు. వెనుక నుంచి బైక్‌ను కారు ఢీకొట్టగా విద్యార్థి నితిన్ సాయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఇది కూడా చదవండి: US Tariffs: ట్రంప్ టారిఫ్‌ ఎఫెక్ట్.. ఆ ఒక్క రంగంలోనే లక్ష ఉద్యోగాలకు ఎసరు..!

అయితే మొదట్లో ఇది ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు భావించారు. కానీ పోలీసుల దర్యాప్తులో కారు ఉద్దేశపూర్వకంగానే ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందని తేలింది. ఒక యువతి కోసం రెండు వర్గాలు ఘర్షణ పడుతున్నట్లుగా తేలింది. దీంతో డీఎంకే కౌన్సిలర్ మనవడు సహా విద్యార్థులను అరెస్ట్ చేయగా.. ఇంకొకరి కోసం గాలిస్తున్నారు.

వాస్తవానికి వెంకటేశన్ అనే విద్యార్థిని బెదిరించడానికి బయల్దేరితే.. స్నేహితుడు నితిన్ సాయి(19) ప్రాణాలు పోయాయి. తలకు తీవ్ర గాయాలై నితిన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నితిన్ సాయి.. అభిషేక్ ఒక బైక్‌పై ఉండగా.. వెంకటేశన్ ఇంకో బైక్‌పై ఉన్నాడు. కానీ అభిషేక్ నడుపుతున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న అభిషేక్ గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కారులో ఉన్న నాల్గవ విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును రాజకీయ సంబంధంగా చూడలేమని డీఎంకే తెలిపింది. ఇది సామాజిక సమస్య అని.. రాజకీయ సమస్య కాదని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు.

Exit mobile version