Site icon NTV Telugu

Cattle Smuggling: పశువుల అక్రమ రవాణా 40 మంది ముఠా ఆట కట్టించిన పోలీసులు!

Cattle Smuggling

Cattle Smuggling

Cattle Smuggling: పశువుల అక్రమ రవాణా కేసులో అంతరాష్ట్ర ముఠా ఆటకట్టించారు పోలీసులు. రాత్రి రాత్రే మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఎత్తుకెళ్లే ముఠా పోలీసులకు చిక్కింది. తెలంగాణలో చోరీ చేసి మహరాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. కానీ, ఈ అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలకు చెక్ పెట్టారు నిర్మల్ పోలీసులు. ఈ ముఠా నాయకుడు నాందేడ్‌కు చెందిన సయ్యద్ సోహెల్. ఇతను దాదాపు 40 మందితో ముఠా ఏర్పాటు చేశాడు. అర్థరాత్రి రోడ్ల మీద ఉండే ఆవులు, ఎద్దులే ఈ ముఠా టార్గెట్. ఇందుకోసం ఖరీదైన కార్లను వాడుతున్నారు. అంతే కాదు ఆవులను కారులోకి ఎక్కించేందుకు వీలుగా వాటిలో డ్రైవర్ సీట్ మినహా మిగతా సీట్లన్నీ తీసివేశారు. ఇందుకోసం నాందేడ్‌లో పెద్ద గ్యారేజ్ కూడా ఏర్పాటు చేశారు.

Red Sandalwood smuggling: కర్ణాటక పుష్ప.. ఆగని ఎర్ర చందనం స్మగ్లింగ్‌ దందా!

అర్ధరాత్రి రోడ్లపై పశువుల కోసం తిరిగే ఈ ముఠా సభ్యులు. ఆవులు, ఎద్దులు కనిపించగానే వాటి వద్దకు వెళ్తారు. మెల్లగా వాటికి మత్తు ఇంజక్షన్ ఇస్తారు. ఆవులు కాస్త మత్తులోకి జారుకోగానే వాటిని అమాంతం కార్లలో ఎక్కించేస్తారు. అక్కడి నుంచి ఉడాయిస్తారు. అలా తీసుకు వెళ్లిన ఆవులను మహారాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఐతే వీరు ఆవులను దొంగతనం చేసేటప్పుడు సీసీ కెమెరాల్లో విజువల్స్ రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. వీరి ఆట కట్టించారు. ఈ కేసులో తొలుత ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద సమాచారం సేకరించి మరో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

POCSO: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నల్లగొండ కోర్టు సంచలన తీర్పు..

రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా వద్ద ఈ ఏడుగురు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బైంసాకు చెందిన షేక్ ఉమెర్ ఈ ముఠాకి సహకరించాడు. అతనిని, ఖులీద్‌ను బైంసాలోనే అరెస్టు చేయగా నాందేడ్‌కు చెందిన రాజు, బైంసాకు చెందిన తయూబ్ పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద రెండు వాహనాలు, 8 మొబైల్ ఫోన్లు, 4 లక్షల 39 వేల 280 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. పశువులు, గోవుల అక్రమ రవాణా చట్టరీత్యా నేరం.. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.

Exit mobile version