Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
- తిరుపతిలో ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి..
- ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా ఘటన..
- యువతి కుటుంబ సభ్యులే దాడి చేశారని ఆరోపణ..
- యువతి మెడలోని తాళిబొట్టును తెంచిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Couple Attacked: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై నడిరోడ్డుపై దాడి జరగడం తిరుపతిలో కలకలం రేపింది. రక్షణ కల్పించాలని కోరుతూ తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలోనే యువతి కుటుంబ సభ్యులు వారిని అడ్డగించి దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో యువతి మెడలోని తాళిబొట్టును తెంచడంతో పాటు యువకుడు చందుపై దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. భయాందోళనలకు గురైన నవ దంపతులు సమీపంలోని ఓ కార్యాలయంలోకి పరుగెత్తి ఆశ్రయం పొందారు. స్థానికుల సహాయంతో వారిని ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు.
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం కేకల దొడ్డిపల్లికి చెందిన శివస్నేహ, సూళ్లూరుపేట మండలం మతిమూడి గ్రామానికి చెందిన చందు కోచింగ్ సెంటర్లో పరిచయం అయ్యారు.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది.. ఈ నెల 19న ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే శివస్నేహ కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు రాయచోటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా చందు తల్లి, పెద్దమ్మ, మేనమామలను మూడు రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారని చందు ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వస్తుండగానే తమపై దాడి జరిగిందని నవ దంపతులు వాపోయారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు నవ వధువు స్టేట్మెంట్ నమోదు చేసి రాయచోటి పోలీసులకు సమాచారం అందించారు..
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
తాజావార్తలు
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
-
Oppo K15 5G: 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. ఒప్పో K సిరీస్ 5G ఫోన్ విడుదల
-
Ashes Test in India: భారత్లో యాషెస్ టెస్టు..? సానుకూలంగా స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.!
ట్రెండింగ్
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!