NTV Telugu Site icon

Vizag Honey Trap Case: కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్‌ కేసులో కొత్త కోణాలు..

Vizag Honey Trap Case

Vizag Honey Trap Case

Vizag Honey Trap Case: కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీ ట్రాప్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.. తవ్వే కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి.. హనీ ట్రాప్ కేసు గుట్టు రట్టు అవ్వడంతో ఒక్కొక్కరిగా బాధితులు పోలీస్ స్టేషన్‌కు క్యూలు కడుతున్నారు.. తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది.. పోలీసులకే జలక్ ఇచ్చింది మాయ లేడీ జాయ్ జేమియా.. 10 నెలల కిందటే ఈ ఏడాది జనవరిలో వ్యాపారవేత్త బీన్ బోర్డ్ డైరెక్టర్ ఎడ్ల ఐజాక్ జెరేమియను హాని ట్రాప్ చేసి.. రేప్ కేసు పెట్టించింది కిలాడీ లేడీ… పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో దీనిపై FIR నమోదు చేశారు. ఆ సమయంలో జేమియ మోసాలను గుర్తించలేకపోయరు పోలీసులు.. అప్పుడు విచారణ లేకుండానే బాధితుడిపై రేప్ కేసు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి.. ఇప్పుడూ అదే వ్యక్తి హాని ట్రాప్ కు గురయ్యానని ఫిర్యాదు చేశాడు.. ఈ కేసుకి సంబంధించి NTV చేతికి 10 నెలల కిందట నమోదైన FIR కాపీ చిక్కింది.. అప్పటి నిందితుడే ఇప్పడు బాధితుడిగా మారాడు..

Read Also: Pakistan : పాకిస్తాన్‌లోని సింధ్‌లో భయం గుప్పిట్లో హిందువులు..ఎందుకో తెలుసా ?

కాగా, విశాఖపట్నంలో వెలుగుచూసిన తాజా ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎన్ఆర్ఐ యువకుడితో పరిచయం పెంచుకుంది. ప్రేమిస్తున్నట్టు మాయమాటలు చెప్పి నిలువునా ముంచేసింది. ఆమె నుంచి తప్పించుకున్న యువకుడు భీమిలి పోలీసులను ఆశ్రయించాడు.. తీగలు లాగితే అసలు డొంకలు కదిలాయి.. షీలానగర్ కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్‌స్టా ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్ లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలినని.. పెళ్లి చేసుకుంటానని అడగ్గా.. అతని తల్లిదండ్రులు నిరాకరించారు.

Read Also: Allu Arjun : పుష్ప – 2 రిలీజ్ డేట్ మారిందోచ్..?

ఇక, ఆ తర్వాత కాలంలో అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడిని మాయ మాటలు చెప్పి విశాఖకు రప్పించింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచే యువకుడిని మురళీనగర్ లోని తన ఇంటికి తీసుకువెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్‌లు.. ఇతర డ్రింక్స్‌ ఇచ్చి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నట్లు ఫొటోలను తీయించింది. వాటితో ఆ యవకుడిని బ్లాక్‌మెయిల్‌ చేసింది. యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పిపెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జెమీమా.. తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది. ఈ క్రమంలో ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో బల వంతంగా నిశ్చితార్థం చేసుకుని.. యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు చేయించింది. యువకుడి ఫోన్ బ్లాక్ చేసి, నిశ్చితార్థం, వారు దగ్గరగా ఉన్న ఉన్న ఫొటోలు చూపించి.. మురళీనగర్ లోని తన ఇంట్లో మళ్లీ నిర్బంధించింది. తనను పెళ్లి చేసుకోక పోతే ఈ ఫొటోలతో పోలీస్ కేసులు పెట్టించి.. అమెరికా వెళ్లకుండా చేస్తానని అతని వద్ద డబ్బులు కాజేసింది. ఆమె ఇంటి నుంచి అతను ఒకసారి పారిపో యేందుకు ప్రయత్నించగా సహచరులతో కలిసి కత్తితో చంపడానికి ప్రయత్నించింది. ఆమె సహచరులు కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే చంపే స్తామని బెదిరింపులకు దిగేవారు. ఎట్టకేలకు ఈ నెల 4వ తేదీన బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మురళీనగర్ లో జెమీమాను అదు పులోకి తీసుకుని.. ఆమె నుంచి ల్యాప్‌టాప్‌, ట్యాబ్, మూడు ఫోన్లు, కారు సీజ్ చేశారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు. జెమీమా స్నేహితులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. హానీ ట్రాప్‌ కేసులో కీలక విషయాలు విశాఖ పోలీసు కమీషనర్ తెలిపారు.. ఇక ఈ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి..

Show comments