Crime: నీట్ విద్యార్థినిపై ఇద్దరు టీచర్ల అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేస్తూ నెలల పాటు అఘాయిత్యం..
- నీట్ విద్యార్థినిపై ఇద్దరు టీచర్ల అఘాయిత్యం..
- బెదిరిస్తూ నెలలుగా అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: విద్య నేర్పిస్తారని నమ్మి వచ్చిన విద్యార్థిని చెరబట్టారు ఇద్దరు టీచర్లు. నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) మెడికల్ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యేందుకు కాన్పూర్ వెళ్లిన ఓ మైనర్‌పై నగరంలోని ప్రముఖ కోచింగ్ సెంటర్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ ఉపాధ్యాయులు నెలల తరబడి అత్యాచారం చేసి బ్లాక్‌మెయిల్ చేశారు. టీచర్లలో ఒకరిని కొన్ని నెలల క్రితం అరెస్ట్ చేశామని, అతను మరో విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్న సీసీటీవీ ఫుటేజీ వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అత్యాచారానికి గురైన అమ్మాయి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయుల్ని అరెస్ట్ చేశారు.
Read Also: Donald Trump: ట్రంప్‌తో భారతీయులకు చిక్కులేనా..? వారి పిల్లలకు పౌరసత్వం డౌటేనా..?
Also Read
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
- Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
విద్యార్థిని 2022లో పరీక్షకు సిద్ధమయ్యేందుకు కాన్పూర్ వెళ్లింది. ఈ ఏడాది జనవరిలో బయాలజీ టీచర్ 32 ఏళ్ల సాహిల్ సిద్ధిఖీ తన ఇంట్లో జరిగే పార్టీకి మైనర్ విద్యార్థిని ఆహ్వానించాడు. అయితే, ఆ అమ్మాయి అతడి ఫ్లాట్‌కి చేరుకోగానే ఒంటరిగా ఉన్నట్లు విద్యార్థిని గ్రహించింది. సిద్ధిఖీ తాగి వచ్చి తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఈ వీడియోలను బయటపెడతామని, తన కుటుంబాన్ని చంపేస్తానని సిద్ధిఖీ బెదిరించాడని, అనేక సందర్భాల్లో తనపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తనను సిద్ధిఖీ తన ఫ్లాట్‌లోనే కొన్ని రోజులు బందీగా ఉంచాడని పేర్కొంది.
ఇదిలా ఉంటే, పార్టీలకు రావాలంటూ బలవంతం చేసే వాడని, అలాంటి ఒక పార్టీలో ఆమెపై 39 ఏళ్ల కెమిస్ట్రీ టీచర్ వికాస్ పోర్వాల్ కూడా అత్యాచారం చేసినట్లు చెప్పింది. హోలీ సందర్భంగా తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లానని, అయితే సిద్ధికీ తనకు ఫోన్ చేసి తిరిగా రావాలిన, రాకపోతే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని విద్యార్థిని తెలిపింది. తాజాగా సిద్ధిఖి మరో విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్న వీడియో వైరల్ కావడంతో బాలిక ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిద్దిఖీ, పోర్వార్‌ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!