AP Fraud: రూ.300 కోట్లు అప్పు చేసిన రియల్టర్..! విదేశాలకు చెక్కేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Fraud: నంద్యాల జిల్లా డోన్ ప్రాంతంలో ఒక రియల్టర్ కోట్లాది రూపాయలు అప్పులు చేసి అదృశ్యమయ్యారు. ప్రముఖ వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదుల నుంచి భారీగా అప్పులు చేశారు. సక్రమంగా వడ్డీ చెల్లించడంతో మరింత అప్పులు ఇచ్చారు. లక్షల్లో మొదలై ఒక్కొక్కరు కోట్లల్లో అప్పులు ఇచ్చారు. గత నెల అక్టోబరు వరకు కూడా సక్రమంగా వడ్డీ క్రమం తప్పకుండా చెల్లించినట్లు సమాచారం. తుగ్గలి మండలం మారేళ్లకు చెందిన ఆ రియల్టర్ డోన్ లో కాపురం ఉంటూ బెంగుళూరు, అంతపురం, గోవాలో భారీ ఎత్తున స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. రియల్టర్ వ్యాపారి తండ్రి ఓ బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. స్థిరాస్తి వ్యాపారం విస్తరించేందుకు డోన్, మారేళ్ల, బెంగుళూరు, అంతపురం వంటి ప్రాంతాల్లో భారీగా అప్పులు చేశారు. అప్పులు ఇచ్చిన వారికి విదేశీ టూర్లు కూడా తీసుకెళ్లేవాడు.. విలువైన మద్యం పార్టీ ఇచ్చేవారు. అప్పులు ఇచ్చిన వారిలో చాలా వరకు బడాబాబులే. ఒక్కొక్కరు రూ.50 లక్షలు మొదలు రూ.10కోట్ల వరకు అప్పులు ఇచ్చారు. మొత్తం అప్పు రూ.300 కోట్ల వరకు చేసినట్టు అంచనా.
రూ.300 కోట్ల వరకు అప్పులు చేసిన రియల్టర్ సుమారు 15 రోజులుగా కనిపించడం లేదని సమాచారం. డోన్ లో ఉన్న ఇంటికి తాళం వేశారు. రియల్టర్, ఆయన తండ్రి, కుమారుడు కూడా కనిపించకుండా పోయారు. రియల్టర్ చిన్న కుమారుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. వందల కోట్లు అప్పులు చేసిన రియల్టర్ అమెరికాకు వెళ్లినట్టు భావిస్తున్నారు. పథకం ప్రకారం గోల్డ్ కార్డ్ కొనుగోలు చేసి అమెరికాకు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అమెరికా, బ్రిటన్, దుబాయ్, ఫిలిప్పీన్స్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల వీసాలు కూడానా రియల్టర్ కు ఉన్నాయని తెలుస్తోంది. స్థిరాస్తి ఆర్థిక సమస్యలతో తప్పించుకొని వెళ్ళారా… ఉద్దేశ్యపూర్వకంగా వందల కోట్లు అప్పులు చేసి దేశం విడిచి వెళ్ళారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియల్టర్ కు ఆస్తులు కూడా బాగానే ఉన్నట్టు సమాచారం. అయితే ఆ ఆస్తులు బ్యాంకులో తాకట్టు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. నవంబరు 18వ తేదీన అమెరికా వెళ్లి, అక్కడికి వెళ్లిన తర్వాత వారి మొబైల్ వాట్సప్ నెంబర్ పనిచేయడం లేదని సమాచారం.
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
15 ఏళ్ల క్రితం బెంగుళూరు కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేపట్టి అనంతపురం, కర్నూలు నగరాల్లోనూ బ్రాంచీలను, ఆఫీసులను ఏర్పాటుచేసి అక్కడ తన కంపెనీ ప్రతినిధులను నియమించి వ్యాపారాన్ని విస్తరించినట్టు సమాచారం. ఖరీదైన కార్లతో లబ్దిదారులను తీసుకెళ్లి తన వెంచర్లను చూపించేవారు.. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందించేవారు. ఇటీవల ఏకంగా 25 కుటుంబాలతో కలిపి ఫ్లైట్ కు బుక్ వేసి ఒక టూర్ ఏర్పాటుచేసినట్లు తెలిసింది. వడ్డీ నూటికి 3 రూపాయలతో ప్రారంభమై ఆ తరువాత రెండు రూపాయలకు తగ్గించినట్లు సమాచారం. ఆ రియల్టర్ కుటుంబ సభ్యులంతా ఖరీదైన కార్లలో తిరిగేవారని చెబుతారు. దాదాపు 7 ఖరీదైన కార్లు వున్నట్లు తెలిసింది. ఆ వాహనాలను ఈ మధ్యనే విక్రయించినట్టు సమాచారం. బెంగుళూరులో ఖరీదైన ఇల్లు ఉన్నట్టు తెలిసింది. విలాసవంతమైన జీవితం గడపడంతో అప్పులు ఇచ్చే వాళ్ళు మరీ మరీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
రియల్టర్ 300 కోట్ల వరకు అప్పు చేసి ఉడాయించినా ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం విశేషం. అప్పులు ఇచ్చిన వారిలో బంధువులు, స్నేహితులు ఎక్కువగా వున్నారు. ఇచ్చిన అప్పు తిరిగి వస్తుందో రాదో… అనవసరంగా బయటపడి పరువు పోగొట్టు కోవడం ఎందుకు అని మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. అప్పులు ఇచ్చిన వారికి ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంత మొత్తంలో అప్పులు చేసి ముఖం చాటేసినా ఏ ఒక్కరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
తాజావార్తలు
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..