Mother kills Son: బిడ్డల కోసం.. కన్న కొడును చంపేసిన తల్లి
- భూవివాదంలో హత్య
- వెలుగోడు మండలం మోతుకూరులో దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother kills Son: ఆస్తులు, కుటుంబ కలహాలు.. కారణాలు ఏవైనా.. అయిన వాళ్లే.. కొంత మందికి శత్రువులుగా మారుతున్నారు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో క్షణికావేశంలో ఏం చేస్తున్నారో కూడా కొంత మందికి తెలియడం లేదు. కానీ క్షణాల్లో ఘోరం మాత్రం జరిగిపోతోంది. ఈ తరహాలోనే నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. కన్న తల్లి కొడుకును హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆయన పేరు సుధాకర్. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం మోతుకూరులో భార్య జ్యోతితో కలిసి ఉంటున్నాడు. ఇతన్ని కన్న తల్లి వెంకట శివమ్మ దారుణంగా చంపేసింది. భూవివాదంలో హత్య చేసినట్లుగా తెలుస్తోంది..
READ ALSO: OG : ఏపీలో పవన్ ఫ్యాన్స్ అలెర్ట్.. ఓజీ ప్రీమియర్స్ టైమ్ ఛేంజ్..
Also Read
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
ఇద్దరు కూతుళ్లకు తలో ఎకరం భూమి ఇవ్వాలన్న తల్లి
సుధాకర్‌కు, ఆయన తల్లితో 6 నెలల నుంచి భూవివాదం ఉంది. తన తండ్రికి చెందిన పొలంలో తన భాగం తనకు ఇవ్వాలని సుధాకర్ కోరుతున్నాడు. కానీ ఇద్దరు కూతుళ్లకు కూడా తలో ఎకరం భూమి ఇవ్వాలని తల్లి చెబుతోంది. దీనికి సుధాకర్ ససేమిరా అన్నాడు. ఈ మధ్యే పండగ కోసం ఇద్దరు కూతుళ్లు ఇంటికి వచ్చారు. దీంతో భూవివాదం మళ్లీ రాజుకుంది. నిజానికి భార్యతో కలిసి వేరు కాపురం ఉంటున్న సుధాకర్.. మరోసారి తల్లి, చెల్లెళ్లకు నచ్చ చెప్పేందుకు తమ్ముని ఇంట్లో ఉంటున్న తల్లి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సుధాకర్ మృతి చెందాడు.
కంట్లో కారం చల్లి..
తన భర్త సుధాకర్ కంట్లో కారం చల్లి.. కట్టుకున్న చీరతోనే ఉరి వేసి కన్న తల్లి వెంకట శివమ్మ చంపేసిందని సుధాకర్ భార్య జ్యోతి ఆరోపించింది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే కొడుకు మృతిపై తల్లి వెంకట శివమ్మ వాదన మరోలా ఉంది. ఇంట్లో ఘర్షణ జరిగిన మాట వాస్తవమేనన్న ఆమె.. మద్యం మత్తులో విసిగిస్తున్నాడని తెలిపింది. ఐతే తోపులాటలో గాయపడి చనిపోయినట్లు ఆమె చెబుతోంది.. మొత్తానికి ఆస్తి వివాదమో.. కుటుంబ కలహాలో.. కారణం ఏదైనా సుధాకర్ మాత్రం మృతి చెందాడు. ప్రస్తుతానికి ఈ కేసులో తల్లి వెంకట శివమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
READ ALSO: Rajinikanth – Kamal Haasan: రజనీ- కమల్ హాసన్‌ను డీల్ చేసే దమ్మెవరికుంది?
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!