Site icon NTV Telugu

Live-in Relation: లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న మహిళ దారుణహత్య.. బిడ్డను కూడా వదల్లేదు..

Live In Relation

Live In Relation

Live-in Relation: లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఉన్న జంటల్లో ఇటీవల హత్యలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య తర్వాత ఇలాంటివి చాలా ఘటనలు నమోదవుతున్నాయి. తాజాగా మహరాష్ట్ర నాగ్‌పూర్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళను ఆమె భాగస్వామి హత్య చేయడంతో పాటు ఆమె బిడ్డను కూడా చంపేశాడు. చివరకు అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శనివారం నాగ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో 30 ఏళ్ల సచిన్ వినోద్ కుమార్ రౌత్ అనే వ్యక్తి 29 ఏళ్ల నజ్నిన్, ఆమె కుమారుడు యుగ్‌లను చంపేశాడు. ఈ ఉదంతం తర్వాత రౌత్ ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ సిబ్బంది ఈ హత్యల్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రౌత్ సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని కనిపించగా.. నజ్నిన్ తలకు గాయం కావడంతో రక్తపు మడుగులో కనిపించింది. ఆమెను తలపై సుత్తెతో కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. అయితే, యుగ్ శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు.

Read Also: Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి మరో బంఫర్ ఆఫర్.. ఆ సినిమాలో ఛాన్స్..

ప్రాథమిక దర్యాప్తులో రైత్‌ బాలుడికి విషం ఇవ్వడం లేదా గొంతు నులిమి చంపినట్లు అనుమానిస్తున్నారు. బాలుడిని చంపడానికి ముందే నజ్నిన్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు హత్యల తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వృత్తిరీత్యా ట్రక్ డ్రైవర్ అయిన రౌత్‌కి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మధ్యప్రదేశ్‌కి చెందిన నజ్నిన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. రౌత్ భార్యకు విడాకులు ఇవ్వకుండా, నజ్నిన్‌తో సహజీవనం చేస్తున్నాడు.

ఈ క్రమంలో రౌత్ నజ్నిన్‌కి ఇటీవల కాలంలో దూరంగా ఉండటం ప్రారంభించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభయ్యాయి. చివరకు వారు విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఇద్దరు విడివిడిగా ఉండాలని నిర్ణయించుకుని 500 రూపాయల స్టాంప్ పేపర్‌పై పరస్పర ఒప్పందంపై సంతకాలు చేశారు. పోలీసులు విచారణ సందర్భంగా ఈ పేపర్‌ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యహ్నం రౌత్, నజ్నిన్, బాలుడు హోటల్‌కి వచ్చినట్లు సిబ్బంది తెలిపింది.

Exit mobile version