Shocking Incident : కర్ణాటకలోని మైసూరు జిల్లా హునసూరు తాలూకాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. గెరసనహళ్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి రక్షితను ఆమె ప్రియుడు అమానుషంగా హతమార్చాడు. పోలీసుల సమాచారం ప్రకారం, రక్షితకు కేరళకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, ఆమెకు బిలికేరె గ్రామానికి చెందిన సిద్ధరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధమే చివరికి ఆమె ప్రాణాలను బలి తీసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన రోజున రక్షిత ఉన్న హోటల్ గదిలో అకస్మాత్తుగా గట్టిగా పేలుడు శబ్దం వినిపించింది. మొదట అది మొబైల్ ఫోన్ పేలినట్లు స్థానికులు భావించారు. అంతేకాకుండా సిద్ధరాజు కూడా ఆ నాటకాన్ని కొనసాగిస్తూ, పేలిన మొబైల్ ఫోన్ శిథిలాలను కిటికీ నుంచి బయటకు విసిరేశానని చెప్పాడు.
Congress : వరంగల్ వర్ధన్నపేటలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర.. నేతల వ్యాఖ్యలతో జోష్
అయితే హోటల్ సిబ్బంది వెతికినప్పుడు బయట ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం అందింది. విచారణలో రక్షిత నోటిలో జెలటిన్ స్టిక్ పెట్టి పేల్చి చంపినట్లు తేలింది. ఈ షాకింగ్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సిద్ధరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ హత్యా సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, ప్రజలు ఇంత క్రూరంగా హత్యకు పాల్పడిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
