NTV Telugu Site icon

Mother Attack Daughter: ఇష్టం లేని పెళ్లి.. కూతుర్ని చంపేందుకు తల్లి కుట్ర

Mother Tried Kill Daugh

Mother Tried Kill Daugh

Mother Tried To Kill Her Daughter With Help Of Auto Driver: తల్లిదండ్రులకు తమ పిల్లల సంతోషమే ఎంతో ముఖ్యం. వారిని సంతోషంగా ఉంచడం కోసం ఏమైనా చేస్తారు. వారి కోరికలు తీర్చడం కోసం, నిరంతరం కఠోర శ్రమ చేస్తారు. తాము పస్తులు ఉండైనా సరే.. పిల్లల కడుపు నింపుతారు. అలాంటి తల్లిదండ్రులు.. పెళ్లి విషయంలోనే ఎందుకో కఠినంగా వ్యవహరిస్తారు. పిల్లల ఇష్టాలను కాదని, తాము చూసినవాడ్నే పెళ్లి చేసుకోవాలంటూ పట్టుబడతారు. ఒకవేళ తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే మాత్రం.. అల్లారముద్దుగా చూసుకున్న పిల్లల మీదే దాడులు చేస్తుంటారు. అందరూ కాదు కానీ, కొందరు మాత్రం ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ తల్లి కూడా అదే పని చేసింది. ఇష్టం లేని పెళ్ళి చేసుకుందని.. తన కూతుర్నే చంపేందుకు ఓ తల్లి సిద్ధమైంది. మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

Women Builders Drill: ఛీ ఛీ.. పాడు..బ్రహ్మచారి దేవుడి ముందు బికినీ ప్రదర్శన

చిన్న గూడూరు మండలం దుమ్ముడ తండాకు చెందిన ఒక యువతి, ఓ యువకుడ్ని ప్రేమించింది. అతడ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. అయితే.. ఈ పెళ్లి మాత్రం ఆ యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో.. ఆ యువతి పెద్ద మనుషుల ముందు పంచాయితీ పెట్టించింది. పెద్ద మనుషులందరూ ఒప్పించడంతో.. తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. కానీ.. తల్లి మాత్రం కూతురిపై పగ పెంచుకుంది. తమ మాట వినకుండా ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో, కూతుర్ని చంపేందుకు సిద్ధమైంది. ఇందుకు ఓ ఆటోడ్రైవర్‌తో కలిసి కుట్ర పన్నింది. అమ్మమ్మ ఇంటికి వెళ్దామని చెప్పి, అత్తింటి నుంచి కూతురిని ఆటోలో తీసుకెళ్లింది. ప్రేమగా నటిస్తూ.. సరైన స్పాట్ కోసం వేచి చూసింది. చివరికి ఓ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నప్పుడు.. ఆటో నిలిపివేసింది. అక్కడ డ్రైవర్ సహాయంతో, కూతురిని చంపేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ యువతి ఎలాగోలా వారి చెర నుంచి తప్పించుకుని బయటపడింది.

Viral Video: పారాగ్లైడింగ్‌లో అపశ్రుతి.. విద్యుత్ స్తంభంపై ఇరుక్కున్న ఇద్దరు వ్యక్తులు.. వీడియో వైరల్

అలా తప్పించుకున్న ఆ యువతి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆటో డ్రైవర్ సహాయంతో తనను చంపేందుకు తన తల్లి ప్రయత్నించిందని, ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్లే ఈ కుట్రకు పాల్పడిందని తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. తాను డ్రైవర్ చెయ్యి కొరికి, వారి నుంచి తప్పించుకొని వచ్చానని పేర్కొంది. ఆ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె తల్లి, ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లారు. అయితే.. ఈలోపే వాళ్లు పారిపోయినట్టు తెలిసింది. దీంతో.. ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Minister KTR: మంచి పనుల్ని చూపెట్టండి.. తప్పు చేస్తే చీల్చి చెండాడండి