Site icon NTV Telugu

Mother Killed Son: కన్నకొడుకునే అతి కిరాతకంగా నరికి చంపిన తల్లి.. ఎందుకంటే..?

Crime

Crime

Mother And Son: నవమాసాలు మోసి కనిన తల్లి.. అతడినే చంపింది. మాములుగా కూడా కాదు అతి కిరాతకంగా నరికి చంపింది. కొన్నేళ్ల నుంచి పడుతున్న కన్నీళ్లను కట్టలు తెంచుకొని కసితో కొడుకు అన్న బంధం కూడా గుర్తురాకుండా కత్తితో ముక్కలు ముక్కలుగా చేసింది. ఇందుకు చిన్న కొడుకు కూడా సాయం చేశాడు. తల్లి కొడుకులు కలిసి పెద్ద కొడుకును ఎందుకు చంపారు. అంతలా అతడు ఏం చేశాడు..? అంటే.. అనంతపురం జిల్లా.. గుంతకల్లు ఆదర్శనగర్‌లో ఒక కుటుంబం నివాసముంటోంది. ఆ కుటుంబ పెద్ద కొడుకు భీమేష్. పచ్చి తాగుబోతు. రోజూ తాగొచ్చి తల్లితండ్రి.. తమ్ముడు అని చూడకుండా చితకబాదడం, గొడవ పెట్టుకోవడం, డబ్బుల కోసం వేధించడం చేస్తూ ఉండేవాడు. కన్నకొడుకు ఏం చేసినా తల్లి మందలించడం మాత్రమే చేసేది.

ఇక అలా మందలించిన రోజు భీమేష్ రెచ్చిపోయేవాడు. తల్లి అని కూడా చూడకుండా రోడ్డు మీదకు ఈడ్చుకొట్టి కొట్టేవాడు. భరించినన్నాళ్లు ఆ కుటుంబం భీమేష్ ను భరించింది. ఇక తమ వలన కాదు అనుకోని రెండు రోజుల క్రితం ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకొంది. చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకును చంపడానికి ప్లాన్ వేసింది. ఎప్పటిలానే మొన్నటి రాత్రి కూడా భీమేష్ ఫుల్ గా తాగొచ్చి ఇంట్లో గొడవకు దిగాడు. ఇక ఇదే అదునుగా భావించిన తమ్ముడు వెనుక నుంచి కర్రతో అన్నాను కొట్టి కిందపడేలా చేశాడు.

ఇక తల్లి కత్తి తీసుకొని కొడుకును అతి కిరాతకంగా నరికి చంపింది. ఎవరికి తెలియకుండా ఒక మూటలో శవాన్ని కట్టి ఊరికి దూరంగా పడేయడానికి తల్లీకొడుకులు బయలుదేరగా స్థానికులు మూటను చూసి వారిని ఆపి అడిగారు. ఇక వారికి అనుమానం రావడంతో మూట, బైక్ అక్కడే వదిలేసి పారిపోయారు. ఇక స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా భీమేష్ శవం కనిపించింది. ఇక డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తల్లీకొడుకులు.. భీమేష్ ను తామే చంపామని, తమను ఎంత క్షోభ పెట్టిందో వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version