Site icon NTV Telugu

దారుణం: భర్త ఆ పని చేశాడని.. పిల్లలను బాత్ టబ్ లో ముంచి..

ప్రస్తుతం వివాహ బంధంలో ప్రేమ కన్నా అనుమానమే ఎక్కువ కనిపిస్తుంది. ఆ అనుమానంతో భార్యాభర్తలు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఇటీవల భార్య అనుమానించిందని ఆమెను, కన్న బిడ్డలని కడతేర్చి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతటి సంచలనాన్ని రేకెత్తించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటి సంఘటనే జర్మనీలో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. జర్మనీలోని సోలెంగెన్‌ పట్టణానికి చెందిన ఒక మహిళకు కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తితో పెళ్ళైంది. వీరికి ఆరుగురు పిల్లలు. ఎప్పుడు సంతోషంగా ఉండే వీరి కాపురంలో అనుమానం చిచ్చుపెట్టింది. భర్త వేరొక మహిళతో చనువుగా ఉన్న ఫోటో ఒకటి భార్య కంటపడింది. దీంతో ఆమె ఆగ్రహానికి గురైంది. కోపంలో అనుకోని దారుణ నిర్ణయం తీసుకుంది. భర్త మీద కోపంతో ఇంట్లో ఉన్న ఐదుగురు పిల్లలను బాత్ టబ్ లో ముంచి హత్య చేసింది.

అనంతరం ఆమె కూడా దగ్గర్లోని రైల్వే ట్రాక్ మీదకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడ స్థానికులు ఆమెను ఆపి పోలీసులకు అప్పగించారు. భర్త, పెద్ద కుమారుడు బయటికి వెళ్లడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గతేడాది జరుగగా.. ఇటీవల కోర్టు ఆమెకు తగిన శిక్షను విధించింది. ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునివ్వగా.. ఆమెకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ఒక లాయర్ పిటిషిన్ పెట్టడం మరో సంచలనంగా మారింది. ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే ఆమె అలా చేసిందని కోర్టులో తెలిపాడు. దీనికి న్యాయస్థానం వివరణ కావాలని, ఆమె పిల్లలను చంపిన తర్వాత భర్తకు ఇక నా పిల్లలను చూసే అవకాశం నీకు లేదని మెసేజ్ పెట్టింది.. అంటే మానసిక స్థితి సరిగ్గా లేనివారు అలాంటి మెసేజ్ ఎలా పెట్టగలరు అని తెలుపూతూ బెయిల్ ని నిరాకరించింది.

Exit mobile version