Site icon NTV Telugu

Snapchat: మేడిపల్లిలో దారుణం.. మైనర్ బాలికతో సహజీవనం.. యువకుడు అరెస్ట్

Minor Girl

Minor Girl

Snapchat: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికతో యువకుడు సహజీవనం చేసిన ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం, చిన్నతనం నుంచే తన అక్క, బావలకు దత్తతగా ఇచ్చిన ఓ బాలిక వారితోనే పెరిగింది. ఏడాది క్రితం పెంపుడు తల్లి అనారోగ్యంతో మరణించగా, పెంపుడు తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో బాలిక స్కూల్ మానేసి ఇంట్లోనే ఉంటోంది.

Tollywood : టాలీవుడ్ లో సెటిల్ అవుతన్న పరభాష హీరోలు.. మన వాళ్ళకి ఇబ్బంది తప్పదు

ఇలాంటి పరిస్థితిలో బాలికకు స్నాప్‌చాట్‌లో అలియాబాద్‌కు చెందిన రవితేజ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. బాలిక పరిస్థితిని గమనించిన రవితేజ ఆమెను ట్రాప్ చేసి తనను లోబార్చుకున్నాడు చేసుకున్నాడు. గత రెండు నెలలుగా బాలిక ఇంట్లోనే సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక సొంత తల్లి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రవితేజపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతడిని రిమాండ్‌కు తరలించారు.

NDA Meeting: నేడు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ప్రసంగించనున్న మోడీ

Exit mobile version