Medak murder case: మెదక్ జిల్లా మగ్దుంపూర్‌లో యువకుడి డెడ్ బాడీకి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మైనర్ అమ్మాయి న్యూడ్ వీడియోలు, ఫోటోలు దగ్గర ఉంచుకుని బెదిరించడమే హత్యకు కారణంగా గుర్తించారు. యువకున్ని హైదరాబాద్ బోరబండకు చెందిన సబిల్‌గా నిర్ధారించారు. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు సబిల్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్లాపూర్‌లో ఓ మెకానిక్ షెడ్‌లో మెకానిక్‌గా పని చేశాడు. గతంలో సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని ఓ కారు మెకానిక్ షాపులో పని చేశాడు. ఆ సమయంలో మెకానిక్ షాపు ఓనర్ బంధువులైన బోరబండ అమ్మాయితో ప్రేమాయణం నడిపాడు. విషయం తెలిసి సబిల్‌ని పనిలో నుంచి తీసేశాడు కారు మెకానిక్ షాపు ఓనర్. ఐతే కొన్ని రోజుల క్రితం తను ప్రేమించిన మైనర్ అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకు వెళ్లాడు సబిల్. ఐతే పక్కా అతడే తీసుకు వెళ్లాడని గుర్తించిన అమ్మాయి కుటుంబ సభ్యులు.. అతనిపై కేసు పెట్టారు. కిడ్నాప్ కేసు పెట్టడంతో.. కొన్ని రోజుల అనంతరం అమ్మాయిని తల్లిదండ్రుల వద్దకు పంపించాడు. కానీ ఆ తర్వాత సబిల్ చేసిన పని అతని ప్రాణాల మీదకు తెచ్చింది…
READ MORE: Nigerian Drug Mafia: హైదరాబాద్‌లో 2500 మంది నైజీరియన్‌లు.. ఏ డ్రగ్ కేసు చూసినా వీళ్లే..!
అమ్మాయి న్యూడ్ ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని.. ఆమె తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అంతే కాదు వాటిలో కొన్నింటిని కుటుంబ సభ్యులకు పంపించాడు. రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఇది అమ్మాయి కుటుంబ సభ్యుల్లో తీవ్ర అలజడి రేపింది. ఎంతో మనో వేదనకు గురయ్యారు. దీంతో సబిల్‌ను హత్య చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 21న మాట్లాడుదాం రమ్మని సబిల్ పిలిపించారు అమ్మాయి కుటుంబ సభ్యులు. డబ్బులు ఇస్తామని నమ్మబలికారు. మగ్దుంపూర్ శివారులోకి రాగానే సబిల్‌ని హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు సబిల్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.