Medak: దేవుడా..! తాగుడుకు డబ్బులు లేవని బిడ్డను అమ్మేసిన తల్లి

  • మెదక్ జిల్లాలో కలకలం రేపిన దారుణ ఘటన
  • మద్యానికి డబ్బుల కోసం పసిబిడ్డను అమ్మేసిన తల్లి
  • అంగన్‌వాడీ టీచర్ అప్రమత్తతతో బయటపడిన ఘటన
  • పసిబిడ్డను స్వాధీనం చేసుకున్న అధికారులు, పోలీసుల దర్యాప్తు
Baby Sale

Baby Sale

మెదక్ జిల్లాలోని హవేలి ఘన్ పూర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యసేవించేందుకు డబ్బులు లేకపోవడంతో కన్నబిడ్డను అమ్మేసింది కసాయి తల్లి. వివరాల్లోకి వెళితే.. లింగసానిపల్లి తండాకు చెందిన మంజుల అనే మహిళకు గత నెల 10వ తేదీన మగ బిడ్డ పుట్టాడు. మంజుల గత కొన్నాళ్లుగా మహిపాల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరిద్దరికీ మద్యం అలవాటు ఉంది. మద్యానికి డబ్బులు లేకపోవడంతో, ప్రియుడు మహిపాల్‌తో కలిసి తన పసిబిడ్డను కామారెడ్డికి చెందిన ఒక దంపతులకు రూ.1.70 లక్షలకు విక్రయించింది.

Amit Mishra: స్టార్ క్రికెటర్ డార్క్ సైడ్ బయటపెట్టిన భార్య!

అయితే.. బాలింతకు ఇవ్వాల్సిన గుడ్లు, పౌష్టికాహారం తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో అనుమానం వచ్చిన అంగన్‌వాడీ టీచర్ మంజుల ఇంటికి వెళ్లి విచారించింది. దాంతో బిడ్డను అమ్మేసిన విషయం బయటపడింది. అంగన్‌వాడీ టీచర్ సమాచారంతో ఐసిడిఎస్ (ICDS) అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. పసిబిడ్డను స్వాధీనం చేసుకుని, తల్లిని, బిడ్డను మెదక్ లోని సఖీ కేంద్రానికి తరలించారు.

Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..