రోజురోజుకు సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. వయసుతో సంబంధం లేకుండా కామంతో రగిలిపోతున్న కామాంధులు ఆడవారిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఒక మైనర్ బాలికను ఆరుగురు మైనర్ బాలురు సాముహిక అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే ధార్వాడ్ జిల్లాలో నివాసముండే ఒక 15 ఏళ్ల బాలిక 10 వ తరగతి చదువుతోంది. నిత్యం స్కూల్ కి వెళ్లి వస్తుందే ఆమెకు మార్గ మధ్యంలో 17 ఏళ్ల వయసున్న ఆరుగురు కాలేజ్ యువకులు పరిచయమయ్యారు. తమను తాము పరిచయం చేసుకున్న యువకులు రోజు బాలికతో మాట్లాడుతుండేవారు. అలా జరుగుతున్నా క్రమంలో ఒకరోజు బాలికను ఆ యువకులు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం ఆ దృశ్యాలను కెమెరాలో బంధించి, ఈ విషయం ఎవరికైన చెప్తే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని మూడు నెలల్లో ఆరుగురు, ఆరు చోట్ల బాలికపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక వారి వేధింపులు తట్టుకోలేని బాలిక ఇంట్లో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వెంటనే బాలికను తీసుకొని తండ్రి పోలీసుల వద్దకు చేరుకొని ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు యువకులను అరెస్ట్ చేసి, వారి వద్దనున్న వీడియోలను డిలీట్ చేశారు.
