NTV Telugu Site icon

Teacher elopes with student: మైనర్ విద్యార్థినితో పారిపోయిన ట్యూషన్ టీచర్..

Karnataka

Karnataka

Teacher elopes with student: ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు ఓ వ్యక్తి. ట్యూషన్‌కి వచ్చే విద్యార్థినితో పారిపోయిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో జరిగింది. ఆరు వారాల తర్వాత మైనర్ బాలికను టీచర్ నుంచి పోలీసులు రక్షించారు. రెండు నెలల క్రితం మైనర్ విద్యార్థినితో పారిపోయిన ట్యూషన్ టీచర్‌ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

Read Also: Bombay High Court: “తెలివి తక్కువగా ఉంటే తల్లి అయ్యే హక్కు లేదా..?” అబార్షన్‌పై బాంబే హైకోర్ట్..

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో అభిషేక్ గౌడ్ అనే 25 ఏళ్ల ఉపాధ్యాయుడిపై కేసు నమోదైంది. ఇతడికి అప్పటికే పెళ్లయి, రెండేళ్ల పాప కూడా ఉంది. నవంబర్ 23న మైనర్ బాలికను కిడ్నాప్ చేశారని, జేపీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ డివిజన్) లోకేశ్ బీజే తెలిపారు.మాండ్యా జిల్లాలోని మలవల్లి తాలూకా నుండి జనవరి 5 న బాలికను రక్షించారు. ఆమె రోజూ ట్యూషన్‌కి వచ్చే క్రమంలో టీచర్ ద్వారా కిడ్నాప్‌కి గురైందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం అభియోగా కింద కేసులు నమోదు చేశారు.

Show comments