NTV Telugu Site icon

Crime: ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. ప్రేమికుడిని ముక్కలుగా నరికి హత్య!

Crime

Crime

ఓ వివాహిత ముగ్గురితో అక్రమసంబంధం పెట్టుకుంది. తనను ప్రాణంగా ప్రేమించిన యువకుడి దారుణ హత్యకు కారణమైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌ లో జరిగింది. ఈ ఘటన పోలీసులను షాక్ కు గురి చేసింది. ఈ కథ ఏంటంటే.. అంజలి, తరుణ్ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు. అంజలికి ఇంతకు ముందే పెళ్లయింది. అయితే భర్తతో విడాకుల కేసు నడుస్తోంది. నిజానికి తను ప్రేమలో ఉన్న అంజలికి ఇప్పటికే చాలా మంది ప్రేమికులు ఉన్నారని తరుణ్ పవార్‌కు తెలియదు. అంతే కాదు తన ప్రేయసికి తన బావమరిది అక్షయ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయి. అక్షయ్ స్నేహితుడు పవన్, ఇతరులతో కూడా అంజలీ సన్నిహితంగా ఉండేది. తరుణ్‌, అంజలి సన్నిహితంగా మెలిగారని తెలియడంతో వారంతా తరుణ్‌ని దారి నుంచి తప్పించాలని ప్లాన్‌ వేశారు. ఈ ప్లాన్‌ను వ్యతిరేకించక పోవడమే కాకుండా, అంజలి స్వయంగా అందులో చేరింది.

READ MORE: Fire Accident: బాపట్ల జిల్లా కర్లపాలెంలో అగ్నిప్రమాదం.. పేదల గుడిసెలు దగ్ధం

ఆగస్టు 17న ఘజియాబాద్‌లోని నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధి రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని సొసైటీలో నివసిస్తున్న ఇంటీరియర్ డిజైనర్ తరుణ్ పవార్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. కొడుకు అదృశ్యంపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత అతడిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబీకులు భావించారు. అయితే పోలీసులు విచారణ ప్రారంభించే సరికి అసలు విషయం తెలిసి కంగుతిన్నారు.

READ MORE:Allu Vs Mega War: అల్లు – మెగా ఫ్యామిలీ వార్ అస్థిత్వం కోసమేనా?

తరుణ్‌తో ప్రేమాయణం సాగించిన అంజలికి తరుణ్ బావమరిదితో కూడా సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో పాటు హంతకుడు పవన్‌తో కూడా అంజలికి సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో భర్త నుంచి అంజలి విడాకుల కేసు కూడా నడుస్తోంది. తరుణ్‌తో అంజలికి ఉన్న సాన్నిహిత్యం తరుణ్ బావమరిది, పవన్‌కి నచ్చలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తరుణ్ బావమరిది అజయ్, పవన్.. తరుణ్ ని చంపాలని ప్లాన్ చేశారు. అంజలి ఒక్కసారి కూడా తరుణ్‌ని రక్షించడానికి ప్రయత్నించలేదు.

READ MORE:Kolkata Doctor Murder: ఉ..2:45గంటల వరకు బతికే ఉన్న ట్రైనీ డాక్టర్ !.. తర్వాత ఏం జరిగింది?

తరుణ్ హత్యకు అంజలి ప్రేమికుడు, తరుణ్ బావమరిది, మరో ప్రేమికుడు ప్లాన్ చేశారు. హంతకులు తరుణ్ ను ఓ ఇంటికి తీసుకెళ్లి అక్కడే గొంతుకోసి హత్య చేశారు. ఈ సమయంలో అంజలి కూడా అక్కడే ఉంది. తరుణ్ హత్యకు గురికావడాన్ని ఆమె చూస్తూనే ఉంది. హత్య సమయంలో గదిలో అక్షయ్‌తో పాటు పవన్, అజ్నీ, జీతే, అంకుర్, దీపాంశు, అంకిత్ కూడా ఉన్నారు. తరుణ్ మృతదేహాన్ని కూడా పోలీసులు పూర్తిగా వెలికితీయలేని విధంగా దారుణంగా హత్య చేశారు. మొదట హంతకులు అతన్ని చాలా గంటల పాటు కొట్టారు. అపస్మారక స్థితికి చేరుకున్నప్పుడు.. గొంతు కోసి చంపారు. అనంతరం మృతదేహాన్ని నగరం నుంచి బులంద్‌షహర్‌కు కారులో తీసుకెళ్లి ముక్కలుగా నరికి, శరీర భాగాలను కాలువలు, అడవులు తదితర ప్రాంతాల్లో పడేశారు. మృతదేహాన్ని గుర్తించలేని విధంగా తల, కాళ్లు, చేతులు వేర్వేరుగా విసిరేశారు.

READ MORE: Uttar Pradesh: మరో ఘటన.. ఇద్దరు విద్యార్థినులను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

ఈ విషయానికి సంబంధించి ఘజియాబాద్ డీసీపీ రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. “హంతకులు తరుణ్‌ను గొంతుకోసి చంపి, ఆపై మృతదేహాన్ని ముక్కలుగా చేశారు. గడ్డపార, కొడవలితో గొంతు, మొండెం, కాళ్లపై కోసి మృతదేహాన్ని ఘజియాబాద్ నుంచి కారులో తీసుకెళ్లి బులంద్‌షహర్ కాలువలో వేర్వేరు ప్రదేశాల్లో పడేశారు. మృతదేహాన్ని మెట్రెస్‌లో చుట్టి బైక్‌పై కారులో తీసుకెళ్లారు. అక్రమ సంబంధాల కారణంగానే ఈ హత్య జరిగింది. అత్యంత కిరాతకంగా హంతకులు పన్నిన ఈ హత్య కుట్రను ఛేదించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే చాలా శ్రమించి నిఘా, సీసీ కెమెరాలు, మాన్యువల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కొందరు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించిన పోలీసులు హంతకుల వద్దకు చేరుకున్నారు. ఈ విషయాన్ని బయటపెట్టేందుకు పోలీసులకు దాదాపు వారం రోజులు పట్టింది.” అని ఆయన పేర్కొన్నారు.

Show comments