Crime: ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. ప్రేమికుడిని ముక్కలుగా నరికి హత్య!
- ఓ వివాహితకు ముగ్గురితో అక్రమసంబంధం
- ప్రాణంగా ప్రేమించిన యువకుడి దారుణ హత్యకు కారణమైన వివాహిత
- దారుణంగా హత్య చేసిన నిందితులు
- శరీర భాగాలు కూడా దొరకని పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వివాహిత ముగ్గురితో అక్రమసంబంధం పెట్టుకుంది. తనను ప్రాణంగా ప్రేమించిన యువకుడి దారుణ హత్యకు కారణమైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో జరిగింది. ఈ ఘటన పోలీసులను షాక్ కు గురి చేసింది. ఈ కథ ఏంటంటే.. అంజలి, తరుణ్ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు. అంజలికి ఇంతకు ముందే పెళ్లయింది. అయితే భర్తతో విడాకుల కేసు నడుస్తోంది. నిజానికి తను ప్రేమలో ఉన్న అంజలికి ఇప్పటికే చాలా మంది ప్రేమికులు ఉన్నారని తరుణ్ పవార్‌కు తెలియదు. అంతే కాదు తన ప్రేయసికి తన బావమరిది అక్షయ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయి. అక్షయ్ స్నేహితుడు పవన్, ఇతరులతో కూడా అంజలీ సన్నిహితంగా ఉండేది. తరుణ్, అంజలి సన్నిహితంగా మెలిగారని తెలియడంతో వారంతా తరుణ్‌ని దారి నుంచి తప్పించాలని ప్లాన్ వేశారు. ఈ ప్లాన్‌ను వ్యతిరేకించక పోవడమే కాకుండా, అంజలి స్వయంగా అందులో చేరింది.
READ MORE: Fire Accident: బాపట్ల జిల్లా కర్లపాలెంలో అగ్నిప్రమాదం.. పేదల గుడిసెలు దగ్ధం
Also Read
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
ఆగస్టు 17న ఘజియాబాద్‌లోని నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధి రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని సొసైటీలో నివసిస్తున్న ఇంటీరియర్ డిజైనర్ తరుణ్ పవార్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. కొడుకు అదృశ్యంపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత అతడిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబీకులు భావించారు. అయితే పోలీసులు విచారణ ప్రారంభించే సరికి అసలు విషయం తెలిసి కంగుతిన్నారు.
READ MORE:Allu Vs Mega War: అల్లు – మెగా ఫ్యామిలీ వార్ అస్థిత్వం కోసమేనా?
తరుణ్‌తో ప్రేమాయణం సాగించిన అంజలికి తరుణ్ బావమరిదితో కూడా సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో పాటు హంతకుడు పవన్‌తో కూడా అంజలికి సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో భర్త నుంచి అంజలి విడాకుల కేసు కూడా నడుస్తోంది. తరుణ్‌తో అంజలికి ఉన్న సాన్నిహిత్యం తరుణ్ బావమరిది, పవన్‌కి నచ్చలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తరుణ్ బావమరిది అజయ్, పవన్.. తరుణ్ ని చంపాలని ప్లాన్ చేశారు. అంజలి ఒక్కసారి కూడా తరుణ్‌ని రక్షించడానికి ప్రయత్నించలేదు.
READ MORE:Kolkata Doctor Murder: ఉ..2:45గంటల వరకు బతికే ఉన్న ట్రైనీ డాక్టర్ !.. తర్వాత ఏం జరిగింది?
తరుణ్ హత్యకు అంజలి ప్రేమికుడు, తరుణ్ బావమరిది, మరో ప్రేమికుడు ప్లాన్ చేశారు. హంతకులు తరుణ్ ను ఓ ఇంటికి తీసుకెళ్లి అక్కడే గొంతుకోసి హత్య చేశారు. ఈ సమయంలో అంజలి కూడా అక్కడే ఉంది. తరుణ్ హత్యకు గురికావడాన్ని ఆమె చూస్తూనే ఉంది. హత్య సమయంలో గదిలో అక్షయ్‌తో పాటు పవన్, అజ్నీ, జీతే, అంకుర్, దీపాంశు, అంకిత్ కూడా ఉన్నారు. తరుణ్ మృతదేహాన్ని కూడా పోలీసులు పూర్తిగా వెలికితీయలేని విధంగా దారుణంగా హత్య చేశారు. మొదట హంతకులు అతన్ని చాలా గంటల పాటు కొట్టారు. అపస్మారక స్థితికి చేరుకున్నప్పుడు.. గొంతు కోసి చంపారు. అనంతరం మృతదేహాన్ని నగరం నుంచి బులంద్‌షహర్‌కు కారులో తీసుకెళ్లి ముక్కలుగా నరికి, శరీర భాగాలను కాలువలు, అడవులు తదితర ప్రాంతాల్లో పడేశారు. మృతదేహాన్ని గుర్తించలేని విధంగా తల, కాళ్లు, చేతులు వేర్వేరుగా విసిరేశారు.
READ MORE: Uttar Pradesh: మరో ఘటన.. ఇద్దరు విద్యార్థినులను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్
ఈ విషయానికి సంబంధించి ఘజియాబాద్ డీసీపీ రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. “హంతకులు తరుణ్‌ను గొంతుకోసి చంపి, ఆపై మృతదేహాన్ని ముక్కలుగా చేశారు. గడ్డపార, కొడవలితో గొంతు, మొండెం, కాళ్లపై కోసి మృతదేహాన్ని ఘజియాబాద్ నుంచి కారులో తీసుకెళ్లి బులంద్‌షహర్ కాలువలో వేర్వేరు ప్రదేశాల్లో పడేశారు. మృతదేహాన్ని మెట్రెస్‌లో చుట్టి బైక్‌పై కారులో తీసుకెళ్లారు. అక్రమ సంబంధాల కారణంగానే ఈ హత్య జరిగింది. అత్యంత కిరాతకంగా హంతకులు పన్నిన ఈ హత్య కుట్రను ఛేదించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే చాలా శ్రమించి నిఘా, సీసీ కెమెరాలు, మాన్యువల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కొందరు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించిన పోలీసులు హంతకుల వద్దకు చేరుకున్నారు. ఈ విషయాన్ని బయటపెట్టేందుకు పోలీసులకు దాదాపు వారం రోజులు పట్టింది.” అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!