Site icon NTV Telugu

ఆమె అనుమానం.. కన్నబిడ్డలను కూడా వదలకుండా అతడి దారుణం

వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య అనుమానాలు సాధారణం. భర్త మరొకరితో సంబంధం పెట్టుకున్నాడని, భార్య వేరొకరితో మాట్లాడుతుందని.. డబ్బులు ఇంట్లో ఇవ్వనుకుండా భర్త ఏం చేస్తున్నాడని .. ఇలాంటి అనుమానాలు ఉండడం సాధారణం. కానీ, భర్త ఒక హత్య చేసాడని, వాళ్ల కుటుంబమే హంతకుల ఫ్యామిలీ అని అనుమానించిన భార్య.. అతడిని ఎత్తిపొడుస్తూ అవమానించడంతో ఆ భర్త తట్టుకోలేకేపోయాడు.. ఆగ్రహంతో భార్యను సుత్తితో తలపై బాది హతమార్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తామిద్దరం లేకపోతే పిల్లలు అనాధలవుతారని వారిని కూడా అతి దారుణంగా తలలు పగలకొట్టి హతమార్చి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గడ్‌ లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. రాయ్ పూర్ కి చెందిన భాస్కర్ తన భార్య సుప్రీతతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ఐదేళ్ల కూతురు, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. కలతలు లేని జీవితం, నిత్యం సంతోషంగా ఉండే వీరి జీవితంలోకి అనుమానం ప్రవేశించింది. ఇటీవల భాస్కర్, తన స్నేహితుడితో పాటు కారులో బయటికి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి స్నేహితుడు కారులోనే శవమై కనిపించాడు. దీంతో ఈ హత్య కేసులో భాస్కర్ కి కూడా సంబంధం ఏమైనా ఉందా అని పోలీసులు అతడిని కూడా విచారణకు పిలిచారు. పోలీస్ కేసు అంటే ఒక పట్టానా అవ్వదు కాబట్టి విచారణ ముగిసేవరకు భాస్కర్ ఇంటికి పోలీసులు వస్తూ ఉండేవారు. ఇక ఈ నేపథ్యంలోనే భార్యకు, భర్తపై నమ్మకం పోయి అనుమానం మొదలయ్యింది. ఒక వేళ భర్తే తన స్నేహితుడిని హత్య చేసి ఉండొచ్చని అనుకోని అతడిని వేధించడం మొదలుపెట్టింది. భర్త అన్న ఆమె బార్యను చంపి జైలుకు వెళ్లడంతో ఆ ఘటనను ఉదాహరణగా తీసుకొని రోజూ భాస్కర్ ని వేధించేది. దీంతో భార్య వేధింపులు తట్టుకోలేని భాస్కర్, ఒక పెద్ద సుత్తితో భార్య తలా పగలకొట్టి హతమార్చాడు. అనంతరం తన బిల్డింగ్ లోని ఆరవ అంతస్తు నుంచి దూకేశాడు.ఇది గమనించిన వాచ్ మెన్ హుటాహుటిన వారి ఇంటికి వెళ్లి చూడగా.. ఘోరమైన సన్నివేశాలు కనిపించాయి. భార్య, ఇద్దరు పిల్లల తలలు సుత్తితో పగలగొట్టడంతో రక్తపు మడుగులో విగతజీవులుగా దర్శనమిచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా భార్య కొనఊపిరితో ఉందని గ్రహించి ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం భాస్కర్ రాసిన సూసైడ్ నోట్ ని స్వాధీనం చేసుకున్నారు. తన భార్య వేధింపులు తట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టానని, మేమిద్దరం లేకపోతే పిల్లలు అనాధలవుతారని వారిని కూడా హతమార్చినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటన రాయ్ పూర్ లో సంచలనంగా మారింది.

Exit mobile version