Site icon NTV Telugu

Musheerabad Murder: దారుణం.. పెళ్లికి నో చెప్పిందని మరదలిని చంపిన మేనబావ..

Musheerabad Murder

Musheerabad Murder

Musheerabad Murder: పెళ్లికి ఒప్పుకోలేదని మరదలిని చంపాడు ఓ మేనబావ. ఈ దారుణ సంఘటన ముషీరాబాద్ బౌద్ధ నగర్‌లో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కుటుంబం బౌద్ధ నగర్‌లో నివసిస్తోంది. సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల పవిత్రపై ఆమె మేనత్త కొడుకు ఉమాశంకర్ దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

READ ALSO: Maoists Surrender: మావోయిస్టు పార్టీకి షాక్.. లొంగిపోయిన మరో కేంద్ర కమిటీ సభ్యుడు

పోలీసుల కథనం ప్రకారం.. ఉమాశంకర్‌ ఇంట్లోకి చొరబడి వంటగదిలో ఉన్న కత్తితో పవిత్రపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం వచ్చిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ముషీరాబాద్‌ పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు ఉమాశంకర్‌ను పట్టుకోడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు తెలిపారు. కుటుంబ సమస్యలు, పెళ్లి విషయంపై ఒత్తిడి కారణంగా ఈ దారుణం చోటుచేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

READ ALSO: Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి

Exit mobile version